నవతెలంగాణ-మునగాల
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు తిప్పి కొట్టాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బుర్రి శ్రీరాములు పిలుపునిచ్చారు.ఆదివారం మండ లంలోని కలకోవ గ్రామంలో పార్టీ జనరల్ బాడీ సమావేశం కుంభజడ వెంకట కోటమ్మ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు కార్మిక ప్రజా వ్యతరేక విధానాలు అవలంబిస్తున్నాయని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ రాజకీయ విలువలు దిగజార్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం బీజేపీతో లోపాయికారింగా రాజకీయ ఒప్పందాలు చేసుకుంటున్నాయని విమర్శించారు. విధానాలు లేని రాజకీయాలు అనుసరిస్తూ ప్రజలని మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గం ఎమ్మెల్యే మల్లయ యాదవ్ తప్పుడు విధానాలు అనుసరిస్తున్నారని విమ ర్శించారు.మలయ్య యాదవ్‌ను వ చ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఓడించాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో మండల కార్యదర్శి చందాచంద్రయ్య, మండలకమిటీ అనంత గురవయ్య,షేక్‌సైదా, మండవవెంకటాద్రి, పార్టీ గ్రామ శాఖ కార్యదర్శులు మండ వ వెంకన్న, సురభి వెంకటనారాయణ, పాఠకొట్ల లింగయ్య, లింగయ్య, గన్నా వెంకటేశ్వర రావు, మండవ లింగయ్య, మండవ వెంకటరావమ్మ, మాజీ సర్పంచ్ మండవ పార్వతమ్మ, మాజీ ఎంపీటీసీ సురభి రేణుక, పాల్గొన్నారు.