సాహిత్యం,కవిత్వం తెలంగాణ కు దివిటీలు: కలెక్టర్ అనుదీప్

– తెలంగాణ సాహిత్య దినోత్సవంలో పేట కవులకు సన్మానం…
నవతెలంగాణ – అశ్వారావుపేట
కవిత్వం ,సాహిత్యం తెలంగాణకు దివిటీలు అని, కవులు, కళాకారుల సాహిత్యోధ్యమం తెలంగాణ సాకారంనికి ఎంతో తోడ్పడిందని కలెక్టర్ అనుదీప్ అన్నారు.దశాబ్ది ఉత్సవాలు పురస్కరించుకుని నిర్వహించే తెలంగాణ సాహిత్య దినోత్సవాన్ని ఆదివారం ఐడిఒసి లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కవి సమ్మేళనంలో ప్రముఖ రచయిత, సాహిత్య విశ్లేషకులు సిద్దాంతాపు ప్రభాకర్ ఆచార్యులు, నవతెలంగాణ విలేకరి మడిపల్లి వెంకటేశ్వరరావులు పాల్గొని కవితా పఠనం చేసారు. అనంతరం డి.పి.ఆర్.ఒ శీలం శ్రీనివాస్, విద్యాశాఖ సి.ఎం.ఒ సైదులు,ప్లానింగ్ కో – ఆర్డినేటర్ సతీష్ కవులను శాలువా,జ్ఞాపికలు తో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం, ఇల్లందు ఎమ్మెల్యే లు వనమా వెంకటేశ్వర రావు, హరి ప్రియా నాయక్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ దిండిగల రాజేందర్, ప్రముఖ కవులు దిలావర్, మండవ సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love