నవతెలంగాణ- నవీపేట్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల నవీపేట్, ప్రస్తుతం వినాయక్ నిజామాబాదులో గల కళాశాలలో ఇంటర్ ఎంపీసీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రాగలత గురువారం ప్రకటనలో తెలిపారు. 2023 మార్చ్- ఏప్రిల్ లో ఎస్ఎస్సి పరీక్షలో ఉత్తీర్ణులైన ఎస్సీ,బీసీ,ఓసి బాలికలు మాత్రమే ఆదాయ విద్యార్హత కుల సర్టిఫికెట్లతో ఈనెల 18వ తేదీ శుక్రవారం వినాయక్ నగర్ లో హాజరుకావాలని కోరారు. పదో తరగతి జిపిఏ ఆధారంగా సీట్లు కేటాయించడం జరుగుతుందని అన్నారు.