- Advertisement -
• మండల విద్యాశాఖాధికారి బుధారపు శ్రీనివాస్
నవతెలంగాణ పెద్దవంగర
మండలంలోని కేజీబీవీ పాఠశాలలో ఖాళీగా ఉన్న గెస్ట్ టీచర్ పోస్టుల కోసం అర్హులైన మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని మండల విద్యాశాఖాధికారి బుధారపు శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేజీబీవీ లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటని, జూవాలజీ, ఇంగ్లిష్, తెలుగు సబ్జెక్టులు ఖాళీలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ పోస్టుల కోసం ఎంపికైన వారు ప్రస్తుత విద్యా సంవత్సరానికి 2026-27 కు మాత్రమే పని చేయాల్సి ఉంటుందని తెలిపారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీఈడీ, టెట్ అర్హత కలిగిన అభ్యర్థులు చిన్నవంగర కేజీబీవీ లో ఈనెల 27, సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు సమర్పించాలని కోరారు.
- Advertisement -



