కాంగ్రెస్ ఎన్నారై సెల్ కోఆర్డినేటర్ నియామకం

నవతెలంగాణ-భిక్కనూర్ : కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ సెల్ జిల్లా కోఆర్డినేటర్ గా చిట్టెడి సుధాకర్ రెడ్డిని నియమించినట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం మాజీ మంత్రి షబ్బీర్ అలీ చేతుల మీదుగా నియామక పత్రం అందజేశారు. అనంతరం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ తమపై నమ్మకంతో అప్పగించిన పదవికి తగిన న్యాయం చేస్తానని హామీ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, కామారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, పట్టణ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోనే శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Spread the love