వైన్స్ షాప్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి

నవతెలంగాణ- నసురుల్లాబాద్ (బాన్సువాడ): బాన్సువాడ డివిజన్ పరిధిలోని ఉన్న వైన్ షాప్ నిర్వాహకులపై ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోవాలని బాన్సువాడ డివిజన్ సిపిఐ పార్టీ కన్వీనర్ దుబాస్ రాములు డిమాండ్ చేశారు బాన్సువాడ మంగళవారం సిపిఐ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ బాన్సువాడ డివిజన్ సిపిఐ పార్టీ కన్వీనర్ దుబాస్ రాములు  మాట్లాడుతూ. బాన్సువాడ పట్టణంలోని వైన్స్ షాపుల నుండి బెల్ట్ షాపులకు మద్యం సరఫరాను నిలిపివేయాలని, బెల్ట్ షాపులను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వైన్ షాపులకు అనుబంధంగా ఉన్న పర్మిట్ రూములు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని, ఆయన తెలిపారు, పర్మిట్ రూములా లేక బార్ రూములా అన్న విధంగా కనబడుతున్నాయని తెలియజేశారు, సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులు రెగ్యులర్గా వైన్ షాపులను తనిఖీలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు, బెల్టు షాపులకు విచ్చలవిడిగా మద్యం సరఫరా చేస్తున్న వైన్ షాప్ నిర్వాహకులపై సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో గంగాధర్, రాజయ్య, దుర్గాప్రసాద్, సాయి ప్రసాద్, సిపిఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love