
తెలంగాణ యూనివర్సిటీ తెలుగు అధ్యయన శాఖ ప్రొఫెసర్ కరిమిండ్ల లావణ్య కు ఫాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ డీన్ గా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ బుర్ర వెంకటేశం ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం యాదగిరి సోమవారం నియామక పత్రాన్ని అందజేశారు. ప్రొఫెసర్ లావణ్య బాలికల వసతి గృహ వార్డెన్ గా, పరీక్షల అదనపు కంట్రోలర్ గా,ఉమెన్ సెల్ డైరెక్టర్ గా,పబ్లికేషన్ సెల్ కో-ఆర్డినేటర్ గా,దక్షిణ ప్రాంగణం ప్రిన్సిపాల్ గా, తెలుగు అధ్యయన శాఖ అధ్యక్షులు గా,పాఠ్య ప్రణాళిక అధ్యక్షులు గా వివిధ పదవులను సమర్థవంతంగా ఇప్పటి వరకు నిర్వహించినారు. డీన్ గా బాధ్యతలు తీసుకున్న లావణ్యను అధ్యాపకులు, అధ్యాపకేతరులు అభినందించారు.