హెచ్చరికలు ప్రకటనలకే పరిమితమా..?

– హరించుకు పోతున్న ప్రాణాలు..
నవతెలంగాణ – డిచ్ పల్లి
రాహదరులపై రైతులు పండించిన పంటలు ఆరబోస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలిసులు హెచ్చరికలు ప్రతి సారి జారీ చేస్తునే ఉన్నారు.కాని చర్యలు చేపట్టినట్లు ఎక్కడ కనబడటంలేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గత నెల 28 న రాత్రి 9 గంటలకు డిచ్ పల్లి మండలం లోని అమృతాపూర్ గ్రామానికి చెందిన కుందేటి శ్రీకాంత్ ఖిల్లా డిచ్ పల్లి గ్రామం నుండి అమృతాపూర్ గ్రామానికి వస్తుండగా రోడ్డుపైనా  వరి కుప్పగా పోసి  ఉండడంవల్ల అమృతాపూర్ గ్రామానికి చెందిన కుందేటి శ్రీకాంత్  తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స పోందుతు మృతి చెందాడు. ఇదే కాకుండా అంతకంటే ముందు కూడా చాలా చోట్లా వరి ధాన్యాం కుప్పలు తెలియక కోందరు మృత్యువాత పడి కుటుంబాలు చిన్న భిన్నమైన సంఘటనలు అనేకంగా ఉన్నాయి.డిచ్ పల్లి మండలంలోని ముళ్ళంగి, ఖిల్లా డిచ్ పల్లి,సుద్ద పల్లి నుండి దర్పల్లి మండలంలోని రామడ్గు వరకు,బీబీపుర్ తండా తో పాటు ఆయా గ్రామాలలో ఇష్టానుసారంగా రహదారులపై అరబోసుకుంటు ఏలాంటి హెచ్చరిక బోర్డులను పేట్టకుండ రెయింబవళ్ళు అలాగే వదిలి వేయడంతో లేని ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. ప్రమాదాలు జరుగకుండా ముందస్తు చర్యలు చేపడ్తే కుటుంబాలు చిన్న భిన్నం కాకుండా కాపాడుకోవచ్చని, ఇంకోదరు ఆరబోసిన ధాన్యం మొత్తంగా ఎండి గలా గలా అయిన సంచుల్లో నింపుకుని అక్కడే వదిలి వేయడం, రాత్రంతా చిమ్మ చీకటి,విధి దిపాలు సైతం లేకపోవడం, ద్విచక్ర వాహనా దారులకు దేగ్గరకు వచ్చే వరకు కుప్పలు కనబడక లేక ప్రమాదాలను కొని తెచ్చుకుంటు ఆసుపత్రుల పాలు, ప్రాణాలు కోల్పోతున్నారని  పలువురు బాదితులు, వాహన దారులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇకనైన రహదారులపై అరబోయ కుండా సంబంధిత శాఖ అధికారులు, పోలిసులు కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.దింతో కోన్ని కుటుంబాలు రోడ్డున పడకుండా కాపాడిన వారౌతమని తెలిపారు. పోలిసులు సైతం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించే విదంగా చుడవల్సిన భద్యత ఎంతైన ఉంది.
Spread the love