విరివిగా వాడుతున్నారా?

విరివిగా వాడుతున్నారా?కొత్తగా పెండ్లయిన వాళ్లు చాలా వరకు గర్భ నిరోధక మాత్రలను విరివిగా వాడతారు. అలా వాడటం మంచిది కాదంటున్నారు వైద్యులు. అది అనేక అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుందట. అవేంటో తెలుసుకుందాం…
– గర్భం రాకుండా ఉండటానికి ఈ మాత్రలు వేసుకుంటారు. కానీ దీని వల్ల చాలా దుష్ప్ర భావాలు ఉన్నాయని చాలామందికి తెలియదు. అయితే అవాంఛిత గర్భధారణను నివారించ డానికి ఇది సులభమైన మార్గం. కానీ వీటిని మరీ ఎక్కువ కాలం వాడటం.. శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపు తుంది. అంతేగాక హార్మోన్ల అసమతుల్యత కూడా ఏర్పడుతుంది. అందుకే ఈ మాత్రలు తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం.
– వైద్య నిపుణుల ప్రకారం.. 25-45 ఏండ్లలోపు మహిళలు ఈ మాత్రలు వాడకూడదు. కానీ కౌమార దశలో ఉన్నవారు దీన్ని పదే పదే ఉపయోగిస్తే అది వారి పునరుత్పత్తి వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. హార్మోన్ల స్థాయిలు లేని యువతులకు ఈ మాత్రలు తీసుకోవడం కూడా ప్రమాదకరం. అలాంటి బాలికలు భవిష్యత్‌లో ఎండోమెట్రియోసిస్‌, పాలిసిస్టిక్‌ అండాశయ వ్యాధులతో బాధపడవచ్చు.
– గర్భధారణకు కూడా సమస్యలు ఏర్పడతాయి. గర్భనిరోధక మాత్రలు గర్భాశయం కంటే ఫెలోపియన్‌ను ప్రభావితం చేస్తాయి. ఇది అంతర్గత రక్తస్రావం కలిగిస్తుంది.
– ఈ మాత్రలను ఎప్పటికీ వాడటం వల్ల వంధ్యత్వం, రుతుస్రావం సరిగా రాకపోవడం, స్కిన్‌ అలెర్జీలు వంటి సమస్యలు వస్తాయి.
– ఈ మాత్రలు శరీరంలో ఈస్ట్రోజెన్‌ స్థాయిలను తగ్గి స్తాయి. అంతేగాక తలనొప్పి, వాంతులు, వికారం, కడుపు నొప్పి మొదలైన సమస్యలు వస్తాయి.
– ఈ మాత్రలలోని సింథటిక్‌ హార్మోన్లు మూడ్‌ స్వింగ్‌కు కారణమవుతాయి. దాంతో చికాకు పెరుగుతుంది.
– వీటిని తరుచూ వినియోగిస్తే.. అది మహిళల ఆరో గ్యానికి మానసికంగా హాని కలిగిస్తుందని చాలా పరిశోధ నలు వెల్లడించాయి. కొంతమంది మహిళల్లో బరువు పెరగడానికి కూడా ఈ మాత్రలు కారణమయ్యాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

Spread the love