ఎల్వోసి చెక్కును అందజేసిన ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న

నవతెలంగాణ – ఆర్మూర్
అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందుల వల్ల మెరుగైన చికిత్స పొందలేని ఒక ఒక వ్యక్తికి పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే, టీఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అండగా నిలిచారు. పట్టణానికి చెందిన డీఆర్ఆర్ శశాంక్ గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా మెరుగైన వైద్య చికిత్స కోసం ఆర్థిక సాయం అందించాలని అతడి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డిని ఆశ్రయించారు. వెంటనే ఆయన సీఎం ఆర్ ఎఫ్ అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువచ్చి రెండు లక్షల  రూపాయల ఎల్ వో సీని మంజూరు చేయించారు. జీవన్ రెడ్డి ఆదివారం  ఎల్ వో సీ చెక్కును అందజేశారు. శశాంక్ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఎల్ వో సీ మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకు జీవన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
Spread the love