నవతెలంగాణ-మిడ్జిల్
వచ్చేనెల జులై 4న మిడ్జిల్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మహబూబ్నగర్ కలెక్టర్ కుష్బూ గుప్త అధికారులకు సూచించారు. మంగళవారం మండల కేంద్రంలో జిల్లా అధికారులతో కలిసి ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న బహిరంగ సభ, అంబేద్కర్, ధ్యాపా గోపాల్ రెడ్డి విగ్రహాల ఏర్పాటు పార్కింగ్ స్థలాలు పరిశీలించారు.
నూతన బస్ షెల్టర్, ప్రజలు బహిరంగ సభకు వెళ్లే రహదారులను పరిశీలించారు. సభకు వచ్చే ప్రజలకు, అధికారులకు ఎలాంటి అసౌకర్యాలు కల్పించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. విగ్రహాలకు కావలసిన దిమ్మెలను త్వరగా పూర్తిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ , ఆర్డీవో, డి.ఎస్.పి వెంకటేశ్వర్లు, తహసిల్దార్ రాఘవేందర్ రెడ్డి, ఎస్సై శ్రీనివాసులు, డాక్టర్ శివకాంత్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అల్వాల్ రెడ్డి, మిడ్జిల్ సర్పంచ్ శంకర్ ముదిరాజ్, వెంకటయ్య, సాయిలు, మహమ్మద్ గౌస్, మండల శాఖ అధికారులు తదితరులు ఉన్నారు.



