ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి..

నవతెలంగాణ – గోవిందరావుపెట్
వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ కి సంబంధించి పోలింగ్ నిర్వాణకు అవసరమైన ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారి మరియు తాసిల్దార్ సృజన్ కుమార్ తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ స్టేషన్లో వద్ద సృజన్ కుమార్ మీడియాతో మాట్లాడారు. మండల వ్యాప్తంగా 1256 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును సోమవారం వినియోగించుకోనున్నట్లు తెలిపారు. పోలింగ్ స్టేషన్ 199లో 738 మంది పోలింగ్ స్టేషన్ 200 లో 518 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు. ఓటర్లకు అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించడం జరిగిందని త్రాగునీరు వెలుతురు మెడికల్ వికలాంగ పట్టభద్రులను తరలించేందుకు అవసరమైన చైర్స్ తో పాటు సిబ్బందిని అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. 14 మంది పోలింగ్ సిబ్బంది పోలింగ్ నిర్వహణలో విధులు నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు. పట్టభద్రులు నిర్దేశించిన టైంలో తమ ఓటు హక్కును నిర్భయంగా స్వచ్ఛందంగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Spread the love