గంజాయితో రవాణా చేస్తున్న యువకుడి అరెస్ట్..

– గంజాయిని వినూత్న పద్ధతిలో టాబ్లెట్లుగా మార్చి రవాణా
– పక్క సమాచారంతో అరెస్టు చేసిన పోలీసులు
నవతెలంగాణ- కంటేశ్వర్

నిజామాబాద్ నగరంలోని రైల్వేస్టేషన్ లో గంజాయి రవాణా చేస్తున్న యువకుడిని అరెస్ట్ చేసినట్టు నిజామాబాద్ 1వ టౌన్ ఎస్ హెచ్ వో విజయ్ బాబు  తెలిపారు. నిజామాబాద్ 1వ టౌన్, టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా గంజాయి రవాణా చేస్తున్నవ్యక్తిని పట్టుకున్నారు. ఇంచార్జి సీపీ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు శుక్రవారం రైల్వే స్టేషన్ లో తనిఖీలు నిర్వహించారు.హైదరాబాద్ లోని షాలిబండ ప్రాంతానికి చెందిన మహ్మద్ ముజాఫర్ ఆలీఖాన్ ను పట్టుకున్నారు. అతని వద్ద నుంచి కిలోన్నర గంజాయి, ఆరు కత్తులు, పది గంజాయి (చరాస్ టాబ్లెట్) లు, రెండు సెల్ ఫోన్ లను సీజ్ చేశారు. అతన్ని ఒకటవ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఈ మేరకు కేసు నమోదు చేశారు. మహ్మద్ ముజాఫర్ ఆలీఖాన్ పై హత్య కేసు తో పాటు దొంగతనం కేసులు హైదరాబాద్ నగరంలో ఉన్నాయని తెలిపారు. ఒకటి హత్య కేసు కాగా మరొకటి దొంగతనం కేసు ఉందని గుర్తించారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. నిందితులపై ఇంకా ఏమైనా కేసులు గాని ఉన్నాయా ఆరాధిస్తున్నారు అని తెలిసింది.

Spread the love