సమస్యలు పరిష్కరించాలని ఆశ వర్కర్ల నిరసన

నవ తెలంగాణ-రెంజల్:
రెంజల్ మండలంలోని ఆశా వర్కర్ల సమ్మె శనివారం నాటికి 13వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ఆశ వర్కర్లతో ప్రభుత్వం వివిధ పథకాల పేరుతో పనులు చేయించుకుంటూ, తమ పనికి తగిన వేతనాన్ని ఇవ్వడంలో పూర్తిగా విఫలమైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆశ వర్కర్ల సమస్యల పై వెంటనే స్పందించి తమకు 18 వేల రూపాయల గౌరవతను ఇవ్వాలని డిమాండ్ చేశారు. చాలీచాలని వేతనాలతో తమ కుటుంబం గడవడం గగనమవుతుందని వారన్నారు. రాత్రింబవళ్లు తమ సేవలను వినియోగించుకుంటున్న ప్రభుత్వం ఆశలకు పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం, ఉద్యోగ భద్రత, కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కవితా, రేఖ, సుజాత, రేవతి, పావని శ్యామల, లావణ్య, నాజీయా, అజ్మీర, శారద, తదితరులు పాల్గొన్నారు.
Spread the love