
మండల వ్యాప్తంగా 109 ములుగు అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ గురువారం నిర్ణయిత సమయం 7 గంటలకు అధికారులు ప్రారంభించారు. ఓటర్లు 7 గంటలకే పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి కనబరిచారు. 2014, 2018 ఎన్నికలతో పోల్చితే ఈసారి ఓటర్లు మరింత ఆసక్తికరంగా ఓటు వేసేందుకు ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు. ఓటింగ్ సరళిని బట్టి చూస్తే ఈసారి ఓటింగ్ శాతం గతంలో కంటే అనూహ్యంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని పలువురు ఓటర్లు రాజకీయ పార్టీలు నాయకులు అభిప్రాయపడుతున్నారు. దూర ప్రాంతాల్లో ఉండే ఓటర్లు కూడా పూర్తిస్థాయిలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిటీ నుండి తమ గ్రామాలకు చేరుకున్నారు. ఓటు వేసిన వెంటనే తిరుగు ప్రయాణం చేయాలని ఉద్దేశంతో ఉదయం ఏడు గంటలకే పోలింగ్ కేంద్రాల్లో ఉండి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు.