Saturday, May 2, 2026
E-PAPER
Homeజాతీయంఎయిరిండియాకు ఏటీఎఫ్‌ సెగ

ఎయిరిండియాకు ఏటీఎఫ్‌ సెగ

- Advertisement -

న్యూఢిల్లీ : పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం అంతర్జాతీయంగా ఇంధన ధరలకు ఆజ్యం పోయడంతో విమానయాన రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌ (ఏటీఎఫ్‌) ధరలు ఇటీవల కొన్ని వారాల్లోనే ఏకంగా 80 శాతం మేర పెరగడం విమానయాన సంస్థలకు గొడ్డలిపెట్టుగా మారింది. ప్రస్తుతం విమాన నిర్వహణ వ్యయంలో దాదాపు 40 శాతం కేవలం ఇంధనం కోసమే వెచ్చించాల్సి వస్తోంది. పెరిగిన ధరల భారంతో సర్వీసులను కొనసాగించడం ఆర్థికంగా లాభదాయకం కాదని భావిస్తున్న సంస్థలు ఇప్పుడు విమానాల కోతపై దృష్టి సారించాయి.ఈ నేపథ్యంలోనే టాటా గ్రూప్‌కు చెందిన ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. ..ఔరోజుకు సగటున 1100 సర్వీసులను నడిపే ఎయిరిండియా ఇప్పుడు అందులో 100 సర్వీసులను తగ్గించుకోవాలని నిర్ణయించింది. ముఖ్యంగా ఇంధన వినియోగం ఎక్కువగా ఉండే లండన్‌, పారిస్‌, న్యూయార్క్‌, టొరంటో, శాన్‌ఫ్రాన్సిస్కో, సిడ్నీ, మెల్‌బోర్న్‌ వంటి సుదూర అంతర్జాతీయ మార్గాల్లో విమాన సర్వీసులపై ఈ కోత పడనుంది. ఢిల్లీ, ముంబయి వంటి ప్రధాన నగరాల నుంచి నడిచే టఈ విమానాల సంఖ్య తగ్గడం వల్ల అంతర్జాతీయ ప్రయాణికులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్‌ ధరల పెరుగుదలకు అనుగుణంగా చమురు సంస్థలు ఏటీఎఫ్‌ ధరను తాజాగా 5 శాతం పెంచడంతో ఢిల్లీలో కిలోలీటర్‌ ధర ర1,511.86 డాలర్లకు చేరింది. వరుసగా రెండో నెల కూడా ఇంధన ధరలు పెరగడం విమానయాన సంస్థల లాభదాయకతను దెబ్బతీస్తోంది. దేశీయ విమాన సంస్థలకు ప్రస్తుతం కొంత మినహాయింపు లభించినప్పటికీ.. అంతర్జాతీయ సర్వీసుల నిర్వహణ భారంగా మారడంతో భవిష్యత్తులో విమాన ప్రయాణ చార్జీలు భారీగా పెరిగే ముప్పు పొంచి ఉంది. ఇది అంతిమంగా సామాన్య ప్రయాణికుడిపై భారం మోపే పరిణామమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

హజ్‌యాత్రికులపై అదనపు రూ.10 వేల భారం
భారత్‌ నుంచి సుమారు లక్షా డెబ్బైఐదు వేల మంది హజ్‌ యాత్రకు దశలవారీగా సౌదీ అరేబియాలోని మక్కాకు వెళ్తున్నారు. ఇప్పటికే మోడీ సర్కార్‌ సబ్సిడీని పూర్తిగా ఎత్తివేసింది. తాజాగా పశ్చిమాసియాలో నెలకోన్న యుద్ధ పరిస్థితులపై భారాన్ని హజ్‌యాత్రికులపైనే వేసింది. దీంతో ప్రతి హజ్‌యాత్రికునిపై రూ. పదివేల భారం పడుతోంది. దీనిపై ముస్లిం సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -