నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డిపేట మండలంలోని వదలపర్తి గ్రామంలో గల ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులు గురువారం రోజు స్వయం పాలన దినోత్సవం జరుపుకున్నారు. ఏడవ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠ్యాంశాలను తోటి విద్యార్థులతో పాటు ఇతర తరగతి విద్యార్థులకు బోధించారు. ప్రధానోపాధ్యాయుడిగా పరమళ్ళ సాత్విక్ .ఉపాధ్యాయులుగా సాయిరాం. బన్నీ. మహేష్ .సందీప్ .సింధు. శరణ్య. నందు. అర్చన. సంపూర్ణ. ఇందు లు విద్యార్థులకు పాఠాలు బోధించారు. కార్యక్రమంలో వారితోపాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కరుణాకర్ ఉపాధ్యాయులు శార్వాణి. భాగ్యలక్ష్మి. గోపాల్ తదితరులు పాల్గొన్నారు.