వాడిలో ఘనంగా స్వయంపాలన దినోత్సవం

నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్

నాగిరెడ్డిపేట మండలంలోని వాడి గ్రామంలో ఎంపీ యూపీఎస్ పాఠశాల విద్యార్థులు బుధవారం రోజు స్వయం పాలన దినోత్సవం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఏడవ తరగతి విద్యార్థులు తోటి విద్యార్థులతో పాటు ఇతర తరగతుల విద్యార్థులకు విద్యాబోధన చేశారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ఎంత కఠినంగా ఉంటుందో వారు వివరించారు. తాము ఉపాధ్యాయులుగా మారి విద్యాబోధన చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రధానోపాధ్యాయులుగా పి రాకేష్. పీటీగా వంశీధర్ . ఉపాధ్యాయులుగా అరవింద్. శ్రీనాథ్ .రోహిత్ .యాదగిరి .అశ్విని. విశాల్. నందిత. భవాని. రాజేష్ ఉపాధ్యాయులుగా మారి విద్యాబోధన చేశారు .కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజు. ఉపాధ్యాయులు శ్వేతా. స్రవంతి. రమనీ. స్రవంతి .స్వర్ణ తదితరులు పాల్గొన్నారు.
Spread the love