హాట్​స్టార్​లోకి ‘అవతార్‌ 2’.. రెంట్‌ చెల్లించకుండానే

నవతెలంగాణ-హైదరాబాద్ : విజువల్ వండర్ అవతార్కు ఎంతటి ఆదరణ లభించిందో తెలిసిందే. ఈ క్రమంలో దీనికి సీక్వెల్గా వచ్చిన అవతార్.. ది వే ఆఫ్ వాటర్ను కూడా ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు తెగ ఆదరించారు. ఈ ఏడాది మార్చి 28 నుంచి డిజిటల్‌ స్ట్రీమింగ్‌ వేదికలైన మూవీఎస్‌ ఎనీ వేర్‌, యాపిల్‌ టీవీ, ప్రైమ్‌ వీడియో, వుడు, ఎక్స్‌ఫినిటీ, గూగుల్‌ప్లే, ఏఎంసీ, మైక్రోసాఫ్ట్‌ మూవీ అండ్‌ టీవీల్లో అద్దె ప్రాతిపదికన అందుబాటులోకి వచ్చింది. అయితే ఇప్పటివరకు అద్దె ప్రాతిపదికన డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ల్లో సందడి చేసింది. అయితే ‘అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌’ చిత్రం త్వరలోనే ‘డిస్నీంహాట్‌స్టార్‌’ లో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. రెంట్‌ చెల్లించకుండానే ఈ సినిమాని సదరు సంస్థ స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంచనుంది. ఈ విజువల్‌ వండర్‌ని జూన్‌ 7న విడుదల చేస్తున్నట్టు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. దీనిపై సినీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘వావ్‌’, ‘సర్‌ప్రైజ్‌ అదిరింది’ అని అంటున్నారు.

Spread the love