నవతెలంగాణ-అమరావతి: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాలను మంగళవారం విడుదల చేయనున్నట్లు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి శేషగిరిబాబు తెలిపారు. బోర్డు వెబ్‌సైట్‌లో రోల్ నంబరు, పుట్టినతేదీ, రశీదు నంబరు నమోదు చేసి ఫలితాలను పొందవచ్చని సూచించారు. రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు జవాబు పత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు. ఈ ప్రక్రియలో ఇబ్బందులు ఎదురైతే టోల్‌ఫ్రీ నంబరు 18004257635లో సంప్రదించాలన్నారు.