అవ్వ కారు గుర్తుపై ఓటేసి నాన్నని ఆశీర్వదించి పార్లమెంటుకు పంపాలి

నవతెలంగాణ- చండూరు
అవ్వ.. నాన్న బీఆర్ఎస్ భువనగిరి అభ్యర్థి క్యామ మల్లేష్  కారు గుర్తుపై ఓటేసి ఆశీర్వదించి పార్లమెంటుకి పంపాలని శనివారం చండూరు మున్సిపల్ పట్టణంలో  క్యామ మల్లేష్ కూతురు హారోహి గెలిపి లక్ష్యంగా ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వానికి పార్లమెంట్‌ ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందింది అన్నారు.  నిస్వార్థ సేవ పరుడు, ప్రజా సమస్యలపై గళం వినిపించే నాయకుడు అని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ తోకల చంద్రకళ వెంకన్న, పట్టణ అధ్యక్షులు కొత్త పార్టీ సతీష్, నగేష్, బూతరాజు వెంకన్న, కోన్యాల మల్లికార్జున్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love