Thursday, July 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హర్ ఘర్ జల్ – మిషన్ భగీరథ కార్యక్రమంపై అవగాహన సమావేశం నిర్వహణ

హర్ ఘర్ జల్ – మిషన్ భగీరథ కార్యక్రమంపై అవగాహన సమావేశం నిర్వహణ

- Advertisement -

నవతెలంగాణ – వనపర్తి :హర్ ఘర్ జల్ – మిషన్ భగీరథ కార్యక్రమంలో భాగంగా వనపర్తి విభాగం ఆధ్వర్యంలో ఖిల్లా ఘనపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ ఆగారం పద్మమ్మ ప్రకాష్ అధ్యక్షతన గురువారం అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నాణ్యమైన, సురక్షితమైన తాగునీటిని నిరంతరం అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, నీటి సరఫరా నిర్వహణ, పైప్‌లైన్‌ల సంరక్షణ, తాగునీటి వృథాను నివారించడం, ప్రజల భాగస్వామ్యం వంటి అంశాలపై అధికారులు సమగ్రంగా వివరించారు. గ్రామ ప్రజలు తాగునీటి సరఫరాకు సంబంధించిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వాటిని పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఆగారం పద్మమ్మ ప్రకాష్ మాట్లాడుతూ, గ్రామంలోని ప్రతి కుటుంబానికి ఎలాంటి అంతరాయం లేకుండా స్వచ్ఛమైన తాగునీరు అందేలా గ్రామపంచాయతీ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. మిషన్ భగీరథ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవడంతో పాటు నీటిని పొదుపుగా వినియోగించాలని, పైప్‌లైన్‌లు లేదా నీటి సరఫరాలో ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే గ్రామపంచాయతీ లేదా సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఈ సమావేశంలో మిషన్ భగీరథ అధికారులు, గ్రామపంచాయతీ సిబ్బంది, వార్డు సభ్యులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -