విద్యార్థులకు అగ్ని ప్రమాదాలపై అవగాహన..

– శిశు మందిర్ పాఠశాలలో అగ్నిమాపక వారోత్సవాలు..
నవతెలంగాణ – వేములవాడ 
వేములవాడ పట్టణంలోని శిశు మందిర్ పాఠశాలలో అగ్నిమాపక వారోత్సవాలో భాగంగా విద్యార్థిని, విద్యార్థులకు శుక్రవారం అగ్ని ప్రమాదాలపై అగ్నిమాపక శాఖ అధికారులు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పాఠశాల మైదానంలో సిలిండర్ లీకేజ్, ఆయిల్ లాంటి లిక్విడ్ ఫైర్, అనుకోకుండా ఇండ్లలో, గడ్డివాములు అగ్ని ప్రమాదాలకు గురైనప్పుడు ఎలా మంటలు చల్లార్చడంపై అగ్నిమాపక పరికరాల ఉపయోగాలను విద్యార్థులకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎల్ ఎఫ్ ఓ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ 1944 ఏప్రిల్ 14న ముంబైలోని విక్టోరియా డక్ యార్డులో షిప్ అగ్ని ప్రమాదం సంభవించి విధి నిర్వహణలో 66 మంది  అగ్నిమాపక సిబ్బంది మరణించారు, వారి స్మారకార్థం ఏప్రిల్ 14 నుండి 20 తేది వరకు దేశవ్యాప్తంగా వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని విద్యార్థులకు తెలిపారు. కర్తవ్య నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నిమాపక సిబ్బందికి జోహార్లు అర్పించడం, అలాగే అగ్ని ప్రమాదాలపై ప్రజలు వివరిస్తూ ప్రజలు చైతన్యవంతులను చేస్తున్నామని అన్నారు. ప్రమాద సంభవించినప్పుడు వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఓ కమలాకర్, ఎల్ ఎఫ్  రాజేంద్రప్రసాద్, డి ఓ పి  యాదయ్య, ఫైర్ మాన్లు సిహెచ్ శంకర్, సిహెచ్ రాజేశం, ప్రధానోపాధ్యాయుడు చిలుక గట్టు, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love