
ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో, జిల్లా చైర్మన్ అలుక కిషన్ అధ్యక్షతన, అణగారిన వర్గాల అభ్యుదయానికి అలుపెరగని కృషిచేసిన సంఘసంస్కర్త, మాజీ ఉప ప్రధానమంత్రి వర్యులు బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని, నగరంలో రైల్వే కమాన్ ఆవరణలో గల, బాబు జగ్జీవన్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించి, వారి కృషిని కొనియాడారు. వారి తెలిపిన బాటలో పయనిస్తూ నిరంతరం అనగారిన ఉద్యోగుల సంక్షేమం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిజిఓ జిల్లా అధ్యక్షులు సంఘం అమృత్ కుమార్ , టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్ , కేంద్రబాధ్యులు పోల శ్రీనివాస్, సతీష్, జిల్లా కార్యవర్గ సభ్యులు జాఫర్ హుస్సేన్, అతిక్, సంజీవయ్య, విశాల్, గురుచరణ్ తదితరులు హాజరయ్యారు.