బ్రెజిల్‌లో ఘోరం

Bad in Brazil– విమాన ప్రమాదంలో 14మంది మృతి
బ్రెజిల్‌ : బ్రెజిల్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఉత్తర అమెజాన్‌లోని బార్సిలోస్‌ ప్రావిన్స్‌లో శనివారం విమానం కూలి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. పర్యాటక కేంద్రమైన బార్సెలోస్‌ ఉత్తర పట్టణంలోని బ్రెజిలియన్‌ అమెజాన్‌ రెయిన్‌ ఫారెస్ట్‌లో చిన్న విమానం కూలిపోవడంతో 14 మంది మరణించినట్లు అమెజోనాస్‌ రాష్ట్ర గవర్నర్‌ విల్సన్‌ లిమా ట్విట్టర్‌ (ఎక్స్‌) వేదికగా వెల్లడించారు. మతుల్లో 12 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. మరణించిన వారిలో అమెరికా పౌరులు ఉన్నారని స్థానిక మీడియా సంస్థలు తెలిపాయి. భారీ వర్షం కురవడంతో విమానం ల్యాండ్‌ అయ్యేందుకు ప్రయత్నించిందని, ఆ సమయంలోనే కూలిపోయిందని పేర్కొంది. స్పోర్ట్‌ ఫిషింగ్‌ కోసం రాష్ట్ర రాజధాని మనౌస్‌ నుంచి బార్సిలోస్‌కు విమానంలో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని బ్రెజిలియన్‌ రాష్ట్ర భద్రతా కార్యదర్శి వినిసియస్‌ అల్మేడా తెలిపారు.

Spread the love