– ఒక బైకు 12 తులాల బంగారం 80 వేల నగదు స్వాధీనం
నవతెలంగాణ భీంగల్: మండలంలోని బడా భీంగల్ గ్రామంలో గల ఇండియ నెంబర్ వన్ ఏటీఎంలో చోరీకి యత్నించిన జక్రాన్ పల్లి మండల కేంద్రానికి చెందిన అల్లెపు స్వామి, అల్లెపు దేవేందర్ ,అల్లెపు శైలజ ఆర్మూర్ కు చెందిన నర్ర నవీన్ ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిందితులను పట్టుకున్నట్లు ఇంచార్జి సిపి జయరాం తెలిపారు గురువారం జిల్లా కేంద్రంలోని కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్మూర్ ఎసిపి జగదీష్ చందర్ తో కలిసి వివరాలు వెల్లడించారు. పాత నేరస్తులైన అల్లెపు స్వామి , నర్ర నవీన్, దేవేందర్ లు ఈనెల 8,9న ఆర్మూర్ మండలంలోని మచ్చర్ల గ్రామంలో అర్థరాత్రి TS16EL3052 నెంబర్ గల ఫ్యాషన్ ప్రో బైక్ ను దొంగతనం చేసి అదే బైకుపై చెంగల్ మీదుగా బడా భీంగల్ చేరుకొని అక్కడ ఖాళీ స్థలంలో ఎవరూ గుర్తుపట్టకుండా ఉండటానికి తమతో తెచ్చుకున్న నల్లని రంగు గల జెర్కిన్ లు, చేతులకు గ్లౌజ్ లు మరియు తలకి హెల్మెట్ ధరించి ఇండియ నెంబర్ వన్ ఏటీఎం ఎదురుగా ఉన్న గల్లి వద్దకు వచ్చి అక్కడ బైకు ను పక్కకు ఆపుకుని చుట్టూ పక్కల ఎవరు రాకుండా నిందితులలో దేవేందర్ అనే వ్యక్తి గమనిచుకుంటూ ఉండగా అల్లేపు స్వామి, నర్ర నవీన్ లు వారి వెంట తెచ్చుకున్న ఇనుప రాడులు తీసుకుని ఏటీఎం వద్దకు వెళ్లి ముందుగా సీసీ కేమెర ల వైర్లు కట్ చేసి, అట్టి కెమెరాలకు నల్లని రంగు పూసి, లోపలి వెళ్లి తమతో తెచ్చుకున్న ఇనుప రాడ్ లతో ఏటీఎం మెషిన్ ని పగలగొట్టేందుకు ప్రయత్నిస్తుండగా చుట్టూ పక్కల వారు అరుస్తున్నట్లు అరుపులు వినబడేసరికి పరారయ్యారు. మరుసటి రోజు వేల్పూర్ మండలంలోని అంక్సాపూర్ గ్రామంలో గల యూనియన్ బ్యాంక్ ఎటిఎం లో దోపిడీ యత్నానికి పన్నాగం పన్నారు ఇందులో భాగంగానే పై ముగ్గురు నిందితులు యధావిధిగా బైకుపై అర్ధరాత్రి జర్కిన్ హెల్మెట్ చేతి గ్లౌజులు వేసుకొని గ్రామంలోకి వెళ్లి ముందుగా గ్రామపంచాయతీ వద్ద TS16UC3747 నెంబర్ గల ట్రాక్టర్ ను దొంగలించి ఏటీఎం ముందర నిలిపి మిషన్లో ట్రాక్టర్ ద్వారా ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా చుట్టుపక్కల అరుపులు వినిపించడంతో పరారయ్యారు. ఈ ఘటనపై భీంగల్ ఆర్మూర్ వేల్పూర్ పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు నమోదు చేసి భీంగల్ సీఐ వెంకటేశ్వర్లు భీంగల్ ఎస్సై హరిబాబు కమ్మర్పల్లి ఎస్సై రాజశేఖర్ ఆధ్వర్యంలో రెండు బృందాలుగా ఏర్పాడ్ దర్యాప్తు ప్రారంబించారు ఇందులో భాగంగానే గురువారం ఉదయం భీంగల్ పట్టణ కేంద్రంలోని ముచ్కూర్ చౌరస్తా వద్ద ఎస్సై హరిబాబు ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా అటుగా వచ్చిన ముగ్గురు నిందితులు పోలీసులను చూసి పారిపోతుండగా వెంబడించి పట్టుకొనగా పత్రాలు లేకపోవడంతో బైకులో పరిశీలించగా అందులో జర్కిన్ లు చేతి గ్లౌజులు నల్లని రంగు డబ్బాలు ఉన్నాయి పైగా ఏటీఎంలో చివరి యత్నానికి ప్రయత్నించిన నిందితుల ముఖ కవళికలు సీసీ కెమెరా ద్వారా సేకరించిన వాటికి పోలి ఉండడంతో విచారించగా నిందితులు అల్లేపు స్వామి,-అల్లేపు దేవేందర్ లు స్వంత అన్నదమ్ములు. స్వంత బావమరిది అయినా మరో నిందితుడు నర్ర నవీన్. అల్లేపు స్వామి యొక్క భార్య అల్లేపు శైలజ. రాత్రి వేళల్లో తాళం వేసిన ఇండ్లల్లో తాళం పగలగొట్టి చోరి చేసి అట్టి బంగారమును అల్లేపు శైలజ ద్వారా అమ్మితే ఎవరు కూడా గుర్తు పట్టరని వారు అల్లేపు స్వామి, నవీన్ లు ఇద్దరూ కలిసి మరియు ఆగస్టు నెలలో వేల్పూర్ మండలంలోని జన్కంపేట్ గ్రామంలో, ఇండ్లల్లో తాళాలు పగులగొట్టి దొంగంతనం చేశారని. సెప్టెంబర్ 19 న రాత్రి సమయములో కుకునూర్, వేల్పూర్ లో రెండ్లు ఇండ్లల్లో దొంగతనాలు చేసి బంగారు, వెండి ఆభరణాలను మరియు నగదు దొంగలించి శైలజకు ఇచ్చినట్లు వారు ఒప్పుకున్నారు. గతంలో వీరు జక్రాన్ పల్లి, నిర్మల్, ధర్మారం, నిజామాబాద్ పట్టణంలో, బాల్కొండ మరియు ఆర్మూర్ PS పరిదిలో దొంగతనాలు చేసి 19 కేసులలో జైలుకి కూడా వెళ్లి వచ్చారు. అల్లెపు స్వామి అలెపు దేవేందర్, నర్ర నవీన్ వద్ద నుండి ఫ్యాషన్ ప్రో బైక్, 40 వేల నగదు అల్లపు శైలజ వద్ద ఒక తులం బంగారు చేను రెండు గ్రాముల చాకటి గుండ్లు 40 వేల నగదును స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించినట్టు కమిషనర్ ఈ కేసులలో చాకచక్యంగా వ్యవహరించిన, భీంగల్ సీఐ వెంకటేశ్వర్లు , భీంగల్, కమ్మర్పల్లి ఎస్సై లుహరి బాబు, రాజ శేఖర్, కానిస్టేబుళ్లు రాజ శేఖర్, రంజిత్, తిరుమలేష్, రఘువీర్, సుదీర్, మనోజ్, రాజ,సంపత్, గంగప్రసాద్ సిపి జయరాం అభినందించి రివార్డులను అందజేశారు. ఈ సమావేశంలో ఆర్మూర్ ఎసిపి జగదీష్ చందర్, సి సి ఎస్ ఏసీపీ విజయ సారథి సిఐపి రమేష్ తదితరులు ఉన్నారు