Thursday, July 2, 2026
E-PAPER
Homeజిల్లాలుచారిత్రక క్షేత్రంలో 'బహునిధి' చిత్ర బృందం సందడి

చారిత్రక క్షేత్రంలో ‘బహునిధి’ చిత్ర బృందం సందడి

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు రూరల్
ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలోని చారిత్రాత్మక సోమేశ్వర ఆలయ ప్రాంగణంలో గురువారం ‘బహునిధి’ సినిమా షూటింగ్ సందడిగా ప్రారంభమైంది.దర్శకుడు టి. రాము దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ను ఆలయ పరిసరాల్లో చిత్రీకరించారు.ఈ సందర్భంగా దర్శకుడు టి.రాము మాట్లాడుతూ భారతదేశంలోని నిధులు,నిక్షేపాల అన్వేషణతో పాటు దేశ సంస్కృతి,పవిత్రత,చారిత్రక వైభవాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసే లక్ష్యంతో ‘బహునిధి’ చిత్రాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు.

ఈ చిత్రం ప్రేక్షకులను ఆలోచింపజేసే విధంగా ఉండటంతో పాటు భారతీయ వారసత్వ గొప్పతనాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు.’గాలి’ చిత్రంలో అమ్మవారి పాత్రలో నటించి గుర్తింపు పొందిన రోజా రాణి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.అలాగే రామ్ ప్రసాద్, అంజలి, జేఎన్‌ఆర్ నవీన్ శ్రీకాంత్,రామశర్మ, చంద్రన్న, భద్రాచారి,శిరీష్ బాబు,కెమెరామెన్ ప్రకాష్ కర్నె, బి.వి. సుబ్బారెడ్డి, చంద్రకళ ( చిన్ని) తదితరులు చిత్రీకరణలో పాల్గొన్నారు.చారిత్రక ప్రాధాన్యం కలిగిన కొలనుపాక సోమేశ్వర ఆలయంలో సినిమా షూటింగ్ జరుగుతుండటంతో గ్రామంలో సందడి నెలకొంది.స్థానికులు షూటింగ్‌ను ఆసక్తిగా వీక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -