నవతెలంగాణ-నెల్లికుదురు
మండలంలోని మునిగిలవీడు గ్రామ ఇందిరమ్మ లబ్ధిదారు నిరుడు విజయ అనంతరెడ్డి గృహప్రవేశానికి హాజరై ఒకే మండలానికి చెందిన ఇద్దరు బడా లీడర్లు వేరువేరుగా శాలువాతో ఘనంగా సత్కరించారు. నిరుడు విజయ అనంతరెడ్డి గృహప్రవేశానికి హాజరై ఆశీర్వదించ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఒకే పార్టీ కాంగ్రెస్ బడా లీడర్ ఓకే మండలం చెందిన ఇద్దరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏదేళ్ల యాదవ రెడ్డి, మరియు మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాయినీ సత్యపాల్ రెడ్డిలు వారి గృహప్రవేశానికి హాజరై ఒకే చోట ఒకే దగ్గర ఉండుకుంటూ వేరువేరుగా కొంతమంది కార్యకర్తలతో కలిసి వారికి శాల తో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బలహీన వర్గాల పార్టీ అని నమ్మిన వారికి మోసం చేయదని మాట ఇస్తే తప్పని పార్టీ అని అన్నారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ గృహ లబ్ధిదారుడు గృహప్రవేశం చేసుకున్న ఆనందం మాకు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లు కేటాయించడం, దానికి ఆర్థికంగా ప్రభుత్వం సహకరించడం దీంతో మాకు ఒక నివాసం ఏర్పడిందని, దీంత మా కుటుంబ సభ్యులందరం సంతోషంగా ఉన్నామని అన్నారు. మాకు సహకరించిన గ్రామ మండల జిల్లా నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బొలికొండ చైతన్య నాగరాజు మండల పార్టీ అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్, కాసం లక్ష్మారెడ్డి గుగులోతు బాలాజీ నాయక్ సీనియర్ నాయకులు ఆకుతోట సతీష్ గుదే యుగేందర్ తుప్పతూరి రాజు సతీష్ నాగరాజు వివిధ గ్రామాల సర్పంచులు ఏఎంసి డైరెక్టర్లు గ్రామ శాఖ అధ్యక్షులు జిల్లా మండలాల గ్రామ నాయకులు పాల్గొన్నారు.



