బీజేపీకి ఓటు వేస్తే రిజర్వేషన్లు ఉండవు: బాజిరెడ్డి గోవర్ధన్..

– తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి..
– ఆగస్టు15 రుణమాఫీ ఏ సంవత్సరమో చెప్పాలి..
– ఎంపీ అరవింద్ తెస్తానన్న.. పసుపు బోర్డు, గల్ఫ్ పాలసీ ఎక్కడ..?
మోడీ వేస్తానన్న రూ.15 లక్షలు, రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడ..
– ఓడిన తర్వాత నేలన్నర రోజులు నిద్రా లేని రాత్రులు గడిపా..
నవతెలంగాణ – డిచ్ పల్లి
బీజేపీ వస్తే రిజర్వేషన్లు ఉండవని, తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డని, ఆగస్టు15 రుణమాఫీ ఏ సంవత్సరమో స్పష్టంగా చెప్పాలని, ఎంపీ అరవింద్ తెస్తానన్న పసుపు బోర్డు, గల్ఫ్ పాలసీ ఎక్కడుందని, మోడీ వేస్తానన్న రూ.15 లక్షలు, రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయని, గత శాసన సభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఒడిన తర్వాత నేలన్నర రోజుల పాటు నిద్రా లేని రాత్రులు గడిపానని, జాతీయ రహదారి 44 నుండి గన్నారం, సిర్నాపల్లి వరకు డబుల్ రోడ్డు నిర్మించానని,తాండాలను గ్రామపంచాయతీలుగా మార్చింది ఘనత కెసిఆర్ కు దక్కుతుందని నిజామాబాద్ బిఅర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్  వ్యాఖ్యానించారు. ఇందల్ వాయి మండలంలోని గన్నారం, మేఘ్య నాయక్ తాండ, సంస్థాన్ సిర్నపల్లి, నల్లవెల్లి యెల్ల రెడ్డి పల్లి  గ్రామాల్లో శుక్రవారం ఎన్నికల ప్రచార భాగంలో స్ట్రీట్ కార్నర్ మీటింగులో ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ వీ గంగాధర్ గౌడ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ…. ఐదు నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పిన  6 గ్యారంటీలు.. రూ.4000 పెన్షన్, రైతుబంధు రూ.15000, యువతకు ఎలక్ట్రిక్ స్కూటీలు,ప్రతి ఒక్కరికి సౌభాగ్య లక్ష్మి కింద రూ.2500, ఈ స్కీములన్ని ఎక్కడ ఉన్నాయని, గ్రామాల్లోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులను మహిళలు, ప్రజలు నిలదీయాలని, ప్రజలకు ఇచ్చిన హామీలపై జవాబు చెప్పలేక తిరిగి పారిపోతారున్నరని తెలిపారు.రూరల్ లో ఎన్నో రకాలుగా అబివృద్ధి చేశానని కాని కాంగ్రెస్ పార్టీ దోంగ హామీలను ప్రజలు నమ్మి ఓట్లు వేశారని, అదికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేయలేదని వివరించారు. గతంలో పాలించిన కాంగ్రెస్ పార్టీ బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చింది లేదని, వారు అదికారంలో ఉన్నప్పుడు రైతుబంధు ఇచ్చింది లేదని, రైతు భీమా ఇచ్చిందా, సీఎం సహాయనిధి ఇచ్చిందా,ఏ ఒక్క స్కీమును అమలుపరిచే దమ్ము వారికి లేదన్నారు.
కానీ చెప్పేటివేమో జూటా మాటలు అ మాటలు నేడు కోటలు దాటుతున్నాయన్నారు. ఇక బీజేపీ పార్టీ స్థానిక ఎంపీ ఐదేళ్లు కాలయాపన చేసి గెలవగానే ఐదు రోజుల్లోనే పసుపు బోర్డ్  తెస్తానన్నావ్, గల్ఫ్ పాలసీ తెస్తానని, ఇంట్లోనే టోల్ ఫ్రీ పేట్టి అదుకుంటనని చేప్పి పచ్చి మోసం దగా చేసిందని దుయ్యబట్టారు. నిజాంషుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానన్నావు, అన్ని జూట మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి గెలిచిన ఎంపీ అరవింద్ చేసింది ఏమి లేదని, ఐదెళ్ళుగా ఏ ఒక్క గ్రామానికి రూపాయి నీదులు ఇవ్వలేదని, ఇన్ని ఏళ్ళు టైంపాస్ చేసి మరోసారి మాయ మాటలు  చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని చుస్తున్నా డని, మోడీ ఇస్తానన్న రూ.15 లక్షలు ఎక్కడ ఉన్నాయని, రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయని, మతాల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందాలనే కుట్రలు చేస్తున్నట్లు విమర్శించారు.  మరోసారి అదికారంలోకి బిజెపి వేస్తే రిజర్వేషన్ లు ఉండవని, ఒక్కోక్క మండలంలో గుళ్ళు గోపురాలు నిర్మించడానికి నీదు లను మంజూరు చేసినట్లు తెలిపారు.బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు ఈనెల 13న ఎన్నికల రోజున ప్రజలు అమూల్యమైన ఓటుతో.. కర్రుకాల్చి వాత పెట్టాలని,బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. గెలిచిన తర్వాత గల్ఫ్ లో కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వారికోసం గల్ఫ్ పాలసీ కోసం కొట్లాడి తీసుకువస్తానని,రైతులకు పసుపు బోర్డు తీసుకువస్తానని, ఆశీర్వదిస్తే ఎళ్ళ వేళల సేవకుడిగా పని చేసి పెడతాఅని ఆయన వివరించారు.  ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాదవత్ రమేష్ నాయక్, జడ్పిటిసి సుమన రవి రెడ్డి , వైస్ ఎంపీపీ భూసని అంజయ్య, బిఅర్ఎస్ మండల అధ్యక్షులు చిలువెరి దాస్,  మండల జాయింట్ సెక్రటరీ పులి శ్రీనివాస్, ఎంపీటీసీలు  లావణ్యరవి, సుధీర్, బాబురావు, చింతల దాస్, తటిపాముల శ్రీనివాస్ గుప్తా, కచ్చకాయల అశ్విని శ్రీనివాస్, మారంపల్లి సుధాకర్, లలిత గణేష్, క్రాంతి కుమార్, అంబర్ సింగ్, బీరిష్ శెట్టి, మాజీ సర్పంచ్లు తెలు విజయ్ కుమార్, విజయలక్ష్మి లక్ష్మారెడ్డి,అను హుస్సేన్,సాంబార్ శ్రీకాంత్, పిండి గంగాధర్, రాజేందర్, గడ్కోల్ శ్రీనివాస్, రూరల్ కన్వీనర్ పాశం కుమార్ టిఆర్ఎస్ పార్టీ అన్ని అనుబంధ సంఘాల నాయకులు, సొసైటీ చైర్మన్లు, డైరెక్టర్లు, మాజీ సర్పంచులు, మాజీ ఉప సర్పంచులు, సీనియర్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
Spread the love