ముమ్మాటికీ కక్షసాధింపే.. జడ్పీటీసి బాజిరెడ్డి జగన్ మోహన్

నవతెలంగాణ – డిచ్ పల్లి
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు ముమ్మాటికీ కక్షసాధింపు చర్యెనని, త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో అక్రమంగా అరెస్టు చేశారని బిఅర్ఎస్ యువ నాయకులు, దర్పల్లి జడ్పీ టీసి బాజిరెడ్డి జగన్ మోహన్ అన్నారు.శనివారం డిచ్ పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బిజెపి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్దం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యనిర్వహక రాష్ట్ర అధ్యక్షులు కేటీఆర్, మాజీ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆదేశానుసారం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కవిత  అరెస్టును నిరసిస్తూ ధర్నా, నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాజిరెడ్డి జగన్ మోహన్ పాల్గొని కేంద్రంలోని బిజెపి వ్యవహరించిన తీరు పై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలో జరిగే ఎన్నికల్లో టిఆర్ఎస్ విజయం సాధిస్తుందని కావాలని బిజెపి ప్రభుత్వం ఆక్రమ అరెస్ట్ కు పాల్పడిందన్నారు.ఈ కార్యక్రమం లో ఎంపీపీ బాదవత్ రమేష్ నాయక్, చిలువేరి గంగదాస్, సినియర్ నాయకులు శక్కరి కోండ కృష్ణ, పద్మారావు,పాశం కుమార్, రఘునథన్ రాము, కచ్చకాయల శ్రీనివాస్, అరటి రఘు, చింతల పల్లి గోవర్ధన్ రెడ్డి, మోహమ్మద్ యూసఫ్, నయీమ్, బుల్లెట్ అక్బర్ ఖాన్, ఎంపిటిసి సాయిలు,నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Spread the love