నవతెలంగాణబ్యూరో- హైదరాబాద్
ఢిల్లీ నార్త్ ఈస్ట్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎన్‌ఎస్‌యూఐ జాతీయ ఇన్‌ఛార్జీ కన్నయ్య కుమార్ తరుపున ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ బుధవారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రాహుల్‌గాంధీతోపాటు ఆయన ఢిల్లీలో ప్రచారం నిర్వహించనున్నారు. ఎన్‌ఎస్‌యూఐ జాతీయ అధ్యక్షులు వరుణ్ చౌదరి అధ్యక్షతన గురువారం నిర్వహించనున్న సమావేశంలో ఆయన మాట్లాడనున్నారు.