రైతుల సమస్యలను పరిష్కరించాలి: బండారు రవికుమార్

నవతెలంగాణ – గోవిందరావుపేట

అకాల వర్షాలకు ఇబ్బందులు పడుతున్న రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీపీఐ(ఎం) పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మండలం లోని పసర లో సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కమిటీ సమావేశం గ్యానం వాసు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా బండారు రవికుమార్ సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు హాజరై మాట్లాడారు. ములుగు జిల్లాలో అకాల వర్షాలతో రైతాంగం తీవ్రంగా దెబ్బతిన్నారని ధాన్యం ఆరబెట్టే అవకాశం లేక రోజు వారి వాళ్లకు రైతులు బిక్కుబిక్కుమంటున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా దెబ్బతిన్న పొలాలను వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించాలని కోరారు. జిల్లాలో ప్రధానంగా గోదావరి పరివాహక ప్రాంతంలో మిర్చి ప్రధాన పంటగా రైతులు పండిస్తున్నారని అలాంటి రైతులకు ఎలాంటి గిడ్డంగి సౌకర్యం లేకపోవడం వలన ఏజెన్సీలో గిరిజన రైతులు ఇబ్బంది పడుతూ తక్కువ రేటుకే మిర్చి అమ్ముకుంటున్నారని ఐ టి డి ఏ, ప్రభుత్వం ఏటూర్ నాగారం మండల కేంద్రంలో మిర్చి ఏసి గోదాములు ప్రభుత్వ నిర్మించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా గోదావరి ఆనుకొని ఉన్న ఐదు మండలాల్లో సాగునీరు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. గోదావరి నీళ్లు ఐదు మండలాలకు మరియు ములుగు జిల్లా రైతులకు తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు. వాజేడు లో మోడికుంట ,గుండ్ల వాగు ప్రాజెక్టును వెంటనే నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం తునికాకు కూలీలకు బోన చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనియెడల పై సమస్యలపై సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో భవిష్యత్తులో ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యు లు సూడి కృష్ణారెడ్డి జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకట్ రెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి రెడ్డి సాంబశివ పొదిలి చిట్టిబాబు రత్నం రాజేందర్ కొప్పుల రఘు తదితరులు పాల్గొన్నారు.
Spread the love