Monday, May 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బండి భగీరథ్ ను వెంటనే అరెస్టు చేయాలి

బండి భగీరథ్ ను వెంటనే అరెస్టు చేయాలి

- Advertisement -

భాధితురాలుని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచాలి
ఆర్టిఐ  జిల్లా నాయకులు వెంకటేశ్వర్లు గౌడ్, కుమార్ యాదవ్
నవతెలంగాణ – మల్హర్ రావు

మైనర్ బాలికను లైంగికంగా వేధించిన బండి భగీరథను పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని జయశంకర్ భూపాలపల్లి యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ జిల్లా కన్వీనర్, జిల్లా చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్, కో కన్వీనర్, చింతల కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలో వారు మాట్లాడారు. మైనర్ బాలికను లైంగికంగా వేధించిన సంఘటన లో భగీరథ ఆరోపణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో నిష్పాక్షిక విచారణ చేపట్టేందుకు నైతిక బాధ్యత వహిస్తూ ఆయన తండ్రి అయిన హోంశాఖ కేంద్ర సహాయ మంత్రి పదవికి బండి సంజయ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బాధిత బాలికను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి విచారణ జరపాలని కోరారు. భగీరథపై పెట్టిన పోక్సో కేసు నుంచి తప్పించేందుకు రాజీ కోసం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వారి వెంట జిల్లా కార్యవర్గ సభ్యుడు గాదం పోషాలు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -