బండి సంజయ్ కి నిలువెల్లా విషం, విద్వేషం

– ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి విమర్శ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు నిలువెల్లా విషం, విద్వేషం చిమ్మే చిల్లర నేత అని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి విమర్శించారు. బీజేపీ, బండి సంజరు అబద్ధాలకు అవిభక్త కవలలు అనీ, చదువుసంధ్యలు లేని సన్నాసి, తలబిరుసు దురహాంకారి, తెలంగాణ రాష్ట్ర అభివద్ధి నిరోధక విద్రోహి అంటూ బుధవారంనాడొక పత్రికా ప్రకటనలో తీవ్రంగా ఫైర్‌ అయ్యారు. తెలంగాణ పాటపైనే కాదు ఆట పైనా గతంలో ఇలాంటి తీట మాటలే మాట్లాడాడనీ, హైదరాబాద్‌ స్పోర్ట్స్‌ హబ్‌ అని కేంద్ర ప్రభుత్వం కొనియాడిన విషయం తెలీదా అని ప్రశ్నించారు. క్రీడల్లో తెలంగాణ ఫస్ట్‌ ఉందనీ, రాజకీయ రాక్షస క్రీడలో మోడీ ఛాంపియన్‌ అనీ ఎద్దేవా చేశారు. దమ్ముంటే మోడీ హైదరాబాద్‌ ఎంపీ స్థానంలో పోటీ చేసి గెలవాలని సవాలు విసిరారు. కాంగ్రెస్‌ యూత్‌ డిక్లరేషన్‌ ట్రూత్‌ లెస్‌, యూజ్‌ లెస్‌ అంటూ విమర్శించారు. అది నిరుద్యోగుల ఓట్లు దండుకొని ఉడాయించే డిక్లరేషన్‌ అంటూ ఎద్దేవా చేశారు.

Spread the love