– క్యూ1 లాభాల్లో 176% వృద్ధి
హైదరాబాద్ : ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో 176 శాతం వృద్థితో రూ.1,551 కోట్ల నికర లాభాలు సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.561 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఏడాదికేడాదితో పోల్చితే గడిచిన క్యూ1లో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 45 శాతం పెరిగి రూ.5,915 కోట్లుగా చోటు చేసుకుంది. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు 9.30 శాతం నుంచి 6.67 శాతానికి తగ్గగా. నికర ఎన్‌పీఏలు 2.21 శాతం నుంచి 1.65 శాతానికి పరిమితమయ్యాయి. 2023 జూన్ ముగింపు నాటికి బీఓఐ గ్లోబల్ వ్యాపారం రూ.12 లక్షల కోట్ల మైలురాయిని దాటింది.