ధరణిని బంద్ చేయడం అంటే దళారి రాజ్యాన్ని తిరిగి తీసుకురావడమే.. 

– పార్టీల చరిత్ర ఏంటో ప్రజలు గుర్తించుకోవాలి..
– కాంగ్రెస్ నాయకులు నోటికి వచ్చినట్టు మాట్లాడడమ..
– మంచిప్ప రిజర్వాయర్లో భూములు కోల్పోయిన బాధితులకు మంచి నష్ట నష్టపరిహారం చెల్లిస్తాం..
– ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రజా ఆశీర్వాద సభా సక్సెస్..
– బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం..
నవతెలంగాణ- డిచ్ పల్లి: ధరణిని బంద్ చేయడం అంటే దళారి రాజ్యాన్ని మళ్ళి తిరిగి తీసుకురావడమేనని,ఏపార్టీల చరిత్ర ఏంటో ప్రజలు గుర్తించుకోవాలని, కాంగ్రెస్ నాయకులు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూన్నరని, అలాంటి వారి మాటలను ప్రజలు నమ్మి మోసపోవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.గురువారం సాయంత్రం డిచ్ పల్లి మండల కేంద్రంలోని ఎఫ్ సి ఐ గోదాం లో వద్ద నిజామాబాద్ రూరల్ నీయోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభా నిర్వహించారు.ఈ సభా కు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై ప్రజలకు అభివాదం చేసిన అనంతరం మాట్లాడారు. తెలంగాణను ఊడగొట్టిండే కాంగ్రెస్ అని ఆ పార్టీ అనాలోచిత నిర్ణయం వల్లే 58 ఏండ్లు గోస పడ్డాం. బంగారం లెక్క ఉన్న రాష్ట్రాన్ని అక్కడి ప్రజలకు ఇష్టం. లేకున్నా నాడు ఆంధ్రప్రదేశ్ లో కలిపింది 400 మందిని పొట్టనపెట్టుకుంది. 2004లో తెలంగాణ ఇస్తా అని బీఆర్ఎస్ పొత్తు పెట్టుకొని మా పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి పార్టీ అస్తిత్వాన్నే దెబ్బతీయాలని చూసిందని, తర్వాత అనేక పోరాటాలతో, బలిదానాలతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయ్యిందని,తెలంగాణకు నీటిని అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇద్దామా..? మళ్లీ దళారుల రాజ్యం తీసుకొద్దామా? 58 ఏండ్ల పాలనలో తెలంగాణ ఎట్లుండే 10 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో ఎలా మారిందో ప్రజలే ఆలోచించాలి. పార్టీల చరిత్ర ఏంటో ప్రజలు గుర్తించుకోవాలని, మోసపోతే గోస పడతాం అభ్యర్థులు ఎవరు బరిలో నిలిచారు. వారి వెనకున్న పార్టీని చూసి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని’ సీఎం కేసీఆర్ కోరారు. ఆ తర్వాత క్రమంలో ఉద్యమాలు దృతం చేసి తెలంగాణను ఇచ్చి తీరాల్సిందేనని ఢిల్లీ మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించుకుందాం సాధించుకున్న తెలంగాణలో మొదట్లో అనేక కష్టాలు ఇబ్బందులు ఉండేవి వాటిని ఎట్ల పరిష్కరించాలని ఆలోచించి ఒక రూట్ మ్యాప్ ని తయారు చేసుకున్నాం సంపదను పెంచాలి పేదోడికి పంచాలి అని నినాదంతో ముందుకు సాగినం ఆ సంక్షేమ పథకాలను అనుభవిస్తున్నాం ఎవరు అడగకముందే 200 పెన్షన్ వేయి రూపాయలకు పెన్షన్ ఆ తర్వాత కాలంలో 2000 కూడా చేసినం రైతుల కోసం రైతుబంధు తెచ్చినం రైతు బీమా 24 గంటలు ఇస్తాక రెండు అనేక పథకాలను పెట్టిన సరే ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాం రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్ణయాలతో అందిస్తున్న మౌలిక సదుపాయాలు రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి ఐటి రంగంలో దూసుకుపోతున్నామని, త్వరలోనే ఐటి రంగంలో బెంగుళూరు కంటే మెరుగైన రాష్ట్రంగా ఉంటామన్నారు.  తెలంగాణ వచ్చిన మొదటిలో రాష్ట్రం తలసరి ఆదాయంలో పదో స్థానంలో ఉండేదని, ఇప్పుడు దేశంలోనే నెంబర్ వన్ గా ఉన్నామన్నారు. కాంగ్రెస్ నాయకులు నోటికి వచ్చినట్టు ఖుల్లగా మాట్లాడుతున్నారని టిపిసిసి మాజీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతుబంధుని దుబారకర్చు అంటున్నాడని, రైతులకు10వేలు ఇచ్చేవారు కావాలా ?లేక 16వేల రూపాయలు కావాలో రైతులు చెప్పాలని,  టిపిసిసి అద్యక్షులు రేవంత్ రెడ్డి మూడు గంటల కరెంటు చాలని అంటున్నారని, రాష్ట్రంలో ఏ రైతైన 10 హెచ్ పి మోటర్ వాడుతార ? వారు 10హెచ్ పి మోటార్లు పెట్టుకోవలని, రైతులకు ఎవరు కోని ఇవ్వాలని వారి అయ్యలు కోనిస్తార అని ప్రశ్నించారు. గతంలో రైతులకు అనేక కరెంట్ కష్టాలు ఉండేవని, సరైన కరెంటు ఉండేది కాదని , దానివల్ల
ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతుండేదని, రైతులకు తివ్ర ఇబ్బందులు పడి రోడ్లపై వచ్చే వారని, ట్రాన్స్ఫార్మర్ తిరిగి కావాలన్న దానిలో ఉన్న  అవినీతి అధికారులకు లంచాలు అడుగుతుండే వారని, రాష్ట్రం వచ్చిన తర్వాత కరెంట్ కష్టాలు ఉన్నాయా అని కెసిఆర్ అన్నారు.రాహుల్ గాంధీ వచ్చి ధరణిని బంగాళాఖాతంలో పడేస్తానని అంటున్నాడని, ధరణిని బంద్ చేయడం అంటే దళారి రాజ్యాన్ని తిరిగి తీసుకురావడమే వారి ఉద్దేశమని,ధరణి కావాలో వద్దో ప్రజలు తేల్చుకోవాలన్నారు. గతంలో పైరవీదారులకు, దళారులు కార్యాలయల చుట్టూ తిరిగి ఒకరి భూమి నుంచి ఇంకోక్కరికి చేసే వారని,అవినీతి అధికారులు భూములను ఇష్టం వచ్చినట్టు రాసుకునే వారని దీంతో గ్రామాల్లో అనేక భూ పంచాయతీలు ఉండేదన్నారు.ఇప్పుడు ధరణిని తీసుకొచ్చి భూమి మీద అధికారాన్ని రైతు బోటన వేలుకు ఇచ్చినమని, రైతు వెళ్లి వేలిముద్ర పెడితే తప్ప ఆయన భూమి మరొకరికి ఎక్కేది లేదన్నారు.అక్కడ క్కడ చిన్నచిన్న సమస్యలు ఉన్న వాటిని పరిష్కరిస్తామని, ధరణి లేకుంటే రైతుబంధు ఎట్ల వస్తాదని ప్రశ్నించారు. మన రాష్ట్రంలో రెండు దిక్కుల గోదావరి కృష్ణ నదులు ప్రవహిస్తున్నాయని, అటువంటప్పుడు గత ప్రభుత్వాలు సీఎంలు ప్రజలకు నీటిని ఇయ్యాలనే ఆలోచన కూడా రాలేదని,గతంలో ప్రభుత్వ ఆసుపత్రులలో పనితీరు ఎలా ఉండేదని, ఇప్పుడు ఎలా మారిందో గుర్తించాలని కోరారు. కేసీఆర్ కిట్ వల్ల హాస్పిటల్లో బిల్లులు కట్టుడు పోయి పాప పుడితే 13000 వేలు, బాబు పుడితే 12000 వేల రూపాయలు ఇచ్చి పంపిస్తున్నామని, గిరిజన తండాలని గ్రామపంచాయతీ చేయాలని గతంలో నిరసనలు జరిగేదని, ఇప్పుడు తండాలకు స్వయం పరిపాలన అందించామన్నారు.ఇదే కాకుండా 10% శాతం గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించామని, త్వరలోనే మంచిప్ప రిజర్వాయర్ పనులు పూర్తిచేసి నిజామాబాద్ రూరల్, బాల్కొండ నియోజకవర్గాల్లోని వ్యవసాయానికి ఇజ్రాయిల్ టెక్నాలజీతో ప్రతి మూడు ఎకరాలకు నీటిని అందిస్తామని, మంచిప్ప రిజర్వాయర్లో భూములు కోల్పోయిన బాధితులకు మంచి నష్ట నష్టపరిహారం చెల్లిస్తామని పేర్కొన్నారు.దేశంలోని 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉంటారు కానీ వారికి పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు .గతంలో రాష్ట్రం మొత్తం మీద మూడు డయాలసిస్ సెంటర్లో ఉంటే వాటిని 103 సెంటర్లకు పెంచిన డైలాగ్స్ పేషెంట్లకు ₹2000 పెన్షన్ కూడా అందిస్తున్నాం టిఆర్ఎస్ పార్టీ పెట్టబోయే బ్యూరో పథకాన్ని గల్ఫ్ కుటుంబాలకు కూడా వర్తింపజేసేలా ఆలోచన చేస్తున్నాం. ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ప్రజల నాయకుడు ఆయన ఇంట్లో ఎప్పుడు చూసినా జనమే ఉంటారు అటువంటి మంచి మనిషిని అనుభవిజ్ఞుణ్ణి గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ నియోజకవర్గ ప్రజలపై ఉంది బాజిరెడ్డి గోవర్ధన్ కి ఓటు వేసి గెలిపించాలని సీఎం కోరారు.
ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్..
అంతకు ముందు బిఅర్ఎస్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్  మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్  కృషి వల్ల నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లో ఎన్నో అభివృద్ధి పనులు చేసుకోవడం జరిగిందని, తెలంగాణ రాకన్నా ముందు ఎలా ఉండేదో, తెలంగాణ వచ్చిన తర్వాత ఎలా ఉందో ప్రజలు గమనించాలన్నారు  ముఖ్యమంత్రి కృషి వల్ల మోపాల్, ఇందల్ వాయి మండలం ఏర్పడడం జరిగిందని, కొన్ని రోజుల క్రితమే మరో మండలం రామడుగు మండలంగా ప్రకటించారని,కేసీఆర్ కృషి వల్ల ధర్పల్లి మండలంలో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి మంజూరు చేయడం జరిగిందని, ధర్పల్లి మండలంలో నర్సింగ్ కాలేజీ మంజూరు చేయాలని కోరారు.  డిచ్పల్లి మండలంలో కూడా డిగ్రీ కళాశాల మంజూరు చేయడం జరిగిందని, తెలంగాణ యూనివర్సిటీ కి అనుబంధంగా ఇంజనీరింగ్ కాలేజ్ మంజూరు చేయాలని కోరారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లో తండాలను 50 గ్రామపంచాయతీలుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దాని,  రూరల్ నియోజకవర్గం లో పోడు భూములకు 3000 ఎకరాలు పట్టాలు పంపిణీ చేయడం జరిగిందని బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లో చాలామంది యువకులు నిరుద్యోగులుగా ఉన్నారని ,వారికి ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి విన్నవించారు. దానివల్ల వారికి  ఉపాధి కల్పించిన వారుము అయితామని వారు పేర్కొన్నారు. జక్రన్ పల్లి మండల వాసుల చిరకాల వాంఛ ఎయిర్పోర్ట్ కావాలని  చాలా కాలం నుండి ఎదురుచూస్తున్నారని, ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా వచ్చిందని, కానీ కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 100 కోట్లు మంజూరు చేసి విమానాశ్రయం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కేసీఆర్ కు  విజ్ఞప్తి చేశారు.ఇప్పటివరకు 17000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది, ఇంకో 4000 కోట్లు రుణమాఫీ చేయాల్సి ఉందని, దాన్ని కూడా తొందర్లో రుణమాఫీ చేసి కాంగ్రెస్ బిజెపి నాయకుల నోరులు మోపించాలని, మనం రుణమాఫీ చేస్తుంటే రుణమాఫీ చేయకుండా అడ్డుపడుతున్న కాంగ్రెస్ బిజెపి నాయకులకు తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పేర్కొన్నారు.ఇందల్వాయి, మోపాల్, రామడుగు, ఎలాగైతే ఏర్పడ్డాయో మండలాలు గా ఇంకొకటి గుండారం మండలాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు కోరారు.నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో గృహలక్ష్మి చాలా తక్కువగా మంజూరయ్యాయి  రూరల్ నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీలు బీసీలు చాలా బీద ప్రజలు ఉన్నారని ,ఇంకొక్క పదివేల గృహలక్ష్మి మంజూరు చేయాలని కెసిఆర్ విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా సిరికొండ మండలంలో కూడా ఐటిఐ కాలేజ్ ని మంజూరు చేశారని దానికోసం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.21 ప్యాకేజీ పనులు తొందరగా జరుగుతున్నాయని, నాలుగు పంపులు కంప్లీట్ చేసుకోవడం జరిగిందని, ఎలాగైతే ఈ ప్రాజెక్టు కింద మంచిప్ప రిజర్వాయర్ కింద ముంపు గ్రామ ప్రజలకు వారికి సరైన నష్టపరిహాన్ని ఇవ్వాలని ఇప్పించాలని సీఎం కేసీఆర్ కి విజ్ఞప్తి చేశారు.  ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే నిజాంబాద్ రూరల్ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందుతోందని వివరించారు.నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లో ఇంకా మిగిలిన పనులు చేపట్టవలసినవి ఉన్నవి తమరితో చర్చించి నిధులు మంజూరు చేయాలని సీఎం కేసీఆర్ ను ఎమ్మెల్యే అభ్యర్థి  బాజిరెడ్డి గోవర్ధన్  విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కుటుంబ సభ్యులు,డిచ్ పల్లి సభలో జడ్పీ చైర్మన్ దదన్నగారి విఠల్రావు,మాజీ స్పీకర్ మధుసూదనాచారి, రాజ్యసభ సభ్యులు కెఅర్ సురేష్ రెడ్డి, ఒలింపిక్ జిల్లా అధ్యక్షులు ఈగ సంజివ రెడ్డి, ఉపాధ్యక్షులు దర్పల్లి జడ్పీ టీసి బాజిరెడ్డి గోవర్ధన్, జడ్పీ టీసి లు సుమన రవిరెడ్డి, దాసరి ఇందిరా లక్ష్మీ నర్సయ్య, ఎంపిపి లు బాదవత్ రమేష్ నాయక్, ఐడిసిఎంఎస్ చైర్మన్ సాంబార్ మోహన్, మండల అధ్యక్షులు చింత శ్రీనివాస్ రెడ్డి, చిలువెరి దాస్,కో ఆప్షన్ సభ్యులు షేక్ నయీమ్, షేక్ హుస్సేన్, యూత్ నాయకులు మోహమ్మద్ నజీర్, యూసుఫ్, ఎస్సీ సెల్ కన్వీనర్ పాశం కుమార్, సర్పంచుల,ఉప సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు మోహన్ రెడ్డి, లోలం సత్యనారాయణ, రఘునథన్ రాము,తో పాటు నీయోజకవర్గ లోని ఆయా గ్రామాలకు చెందిన సర్పంచులు ఎంపిటిసిలు ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love