– నాయకుల ఒంటెద్దు పోకడ
– ఐక్యత లోపమే కారణం
– కలగా మారిన స్థానికులకు టికెట్
నవతెలంగాణ- నసురుల్లాబాద్: బాన్సువాడ నియోజవర్గపు అసెంబ్లీ ఎన్నిక టికెట్ విషయంలో స్థానికులకు ఇవ్వకుండా స్థానికేతరులకు ఇవ్వడంతో నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జ్ కాసుల బాలరాజ్ ఆత్మహత్యాయత్నం చేసుకోవడంతో ఆ పార్టీలో అంతర్మధనం మొదలయ్యింది. నామినేషన్ల ప్రక్రియ అతి దగ్గరలో ఉండడంతో నియోజవర్గం కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు స్థానిక, స్థానికతరుల సమస్య ఎదురైంది. 2009 నుంచి బాన్సువాడ నియోజకవర్గం లో బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్గా కాసుల బాలరాజు కొనసాగుతున్నారు గతంలో రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వగా స్వల్ప మెజార్టీతో కాసుల బాలరాజు ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో కాసుల బాలరాజ్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేయగా ఈనెల 8న ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కి టికెట్ కేటాయించడంతో మనస్థాపన చెంది బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కాసుల బాలరాజు బుధవారం బాన్సువాడ పట్టణంలో నిరాహార దీక్షలు చేపట్టారు సంఘీభావం తెలపడానికి వివిధ మండలాల నుంచి తరలివచ్చిన కార్యకర్తలు ఓదారుస్తుంటే క్షణిక ఆవేశం మనస్తపం చెంది తన నివాసం ఇంట్లోకి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం పాల్పడ్డారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలు వెంటనే బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు పరిస్థితి విషమించడంతో నిజాంబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు ఆయనకు పరామర్శించడానికి వివిధ మండలాల నుంచి భారీగా నాయకులు, కార్యకర్తలు నిజాంబాద్ వెళ్లి పరామర్శించారు. కాంగ్రెస్ అధిష్టానం స్థానికులకు ఇవ్వకుండా స్థానికేతరులకు టికెట్ కేటాయించడం వలన నాయకులు కార్యకర్తలకు తీవ్ర నష్టం జరుగుతుందని సీనియర్ నాయకులు వారి అభిప్రాయం వ్యక్తం చేశారు. బాన్సువాడ టికెట్ కావాలంటూ బాన్సువాడ నియోజకవర్గ స్థానికులు టికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా దరఖాస్తు చేసుకున్న వారికి ఎవరికి టికెట్ ఇవ్వకుండా ఒక రోజు ముందు బీజేపీ పార్టీ నుంచి వలస వచ్చిన ఏనుగు రవీందర్ రెడ్డికి టికెట్ కేటాయించడంపై బాన్సువాడ కాంగ్రెస్ పార్టీలో అసమతి సెగలు అంటుకున్నాయి. బాన్స్వాడ నియోజకవర్గంలో నాలుగు గ్రూపులుగా నాయకులు ఏర్పడినారు. రాజకీయ లబ్దికోసం కొందరు కాంగ్రెస్ పార్టీని బలి పశువు చేస్తుందని సీనియర్ నాయకులు వారి అభిప్రాయం వ్యక్తం చేశారు. 2018లో కాసుల బాలరాజ్ కు టికెట్ వస్తే కొందరు కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచారని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొన్నిటిని పట్టించారని, అలాగే ఈ ఎన్నికల్లో పార్టీని బ్రష్టు పట్టించడానికి వర్ని మండలానికి చెందిన కొందరు బాన్సువాడకు చెందిన కొందరు కాంగ్రెస్ పార్టీను ఐక్యతను దెబ్బతీసేందుకై పన్నాగాలు వేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. గత రెండు నెలల నుంచి స్థానికులకే టికెట్ ఇవ్వాలంటూ వర్ని కాంగ్రెస్ నాయకులు పట్టుబట్టి కూర్చున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికలో పాదాల మధ్యలో ఏ ఒక్కరికైనా టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ రాగానే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికీ వచ్చిన సరే బాన్సువాడ కాసుల బాలరాజుకు టికెట్ ఇవ్వద్దంటూ కొందరు నాయకులు డిమాండ్ చేయడంతో అధిష్టానం వీరి ఐక్యత లోపల్ని గుర్తించి స్థానికేతులకు టికెట్ కేటాయించడంతో స్థానిక కాంగ్రెస్ లో నిరసన అవమానం భరించలేక మనస్తపం చెంది కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాసుల బాలరాజు ఆత్మహత్య గీతనం చేశారు దీనితో అధిష్టానం అంతర్ మదనంలో పడినట్లు తెలుస్తుంది.
ఒంటెద్దు పోకడే కారణమా?
బాన్సువాడ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న నాయకులు ఉంటే పోకూడదని స్థానికులకు టికెట్ ఇవ్వకుండా స్థానికేతులకు టికెట్ కేటాయించారని రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు. గత ఆరు మాసాలుగా బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా సమావేశాలు నిర్వహించకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు సమావేశం నిర్వహించడం, ర్యాలీలు నిర్వహించడం ఎవరికి నచ్చిన విధంగా వారికి డబ్బులు ఆర్థిక సాయం చేయడం, తమకు నచ్చిన విధంగా ఫ్లెక్సీలతో ప్రచారం చెయ్యడం, నియోజవర్గ నాయకులు కలిసికట్టుగా పనిచేయకపోవడం, నియోజకవర్గ నాయకులు కార్యకర్తలను పెడచెవిన పెట్టడం తనకు నచ్చిన నలుగురు కార్యకర్తలు సమావేశం ఏర్పాటు చేయడంతో ఇలాంటి సమస్యలు ఏర్పడ్డాయి, సీనియర్ నేతలు ఏ ఒక్కరినీ సంప్రదించకుండా ప్రచారం నిర్వహించడం, సలహాలు, సూచనలు తీసుకోకపోవడం కూడా ప్రతికూలంగా మారాయని అంటున్నారు. బాన్సువాడ నియోజకవర్గం లో ఒక సీనియర్ నేత ఆత్మహత్య ఇతను చేసుకోగా ఇప్పటికైనా నిజ వర్గ నాయకులు ఐక్యంగా ఉండి ఒకరికొకరు సహకరించుకొని పార్టీ బలోపేతం చేసేందుకు కృషి చేయాలని సీనియర్ నాయకులు కోరుతున్నారు.