మేడిగడ్డ వంతెనపై బారికేడ్ల..

నవతెలంగాణ – హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు అంశం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. విపక్షాలైన కాంగ్రెస్, బీజేపీలకు ఇది ప్రచార అస్త్రంగా మారింది. ఈ క్రమంలోనే అధికార బీఆర్ఎస్​పై విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. ఒక్క ప్రాజెక్టు కూడా సరిగ్గా కట్టలేని కేసీఆర్.. మళ్లీ ఓటు వేయమని ఎలా అడుగుతున్నారంటూ ఇరు పార్టీలు ధ్వజమెత్తుతున్నాయి. అయితే ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజీ వద్ద అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ.. మేడిగడ్డ బ్యారేజీ పరిసరాల్లో ఆంక్షలు విధించారు. బ్యారేజీ ఏడో బ్లాక్‌ 20వ పియర్‌ కుంగిపోయి దెబ్బతినడంతో సరిహద్దులో తెలంగాణ, మహారాష్ట్రల మధ్య అక్టోబరు 21వ తేదీ నుంచి రాకపోకలను నిలిపివేశారు. ఈ నేపథ్యంలో బ్యారేజీ వైపు ఎవరూ వెళ్లకుండా అధికారులు, సంస్థ ప్రతినిధులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. పెద్దరేకులను అడ్డుపెట్టి ఆ మార్గాన్ని మూసివేశారు. అధికారులు, సిబ్బందికి మాత్రమే రాకపోకలకు అనుమతి ఉంది.

Spread the love