బీసీ కుల వృత్తుల అభివృద్ధి కోసమే బీసీ బంధు

– ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌ రెడ్డి
నవతెలంగాణ-పరిగి
బీసీ కులవృత్తుల అభివృద్ధి కోసమే ప్రభుత్వం బీసీ బంధు తీసుకొచ్చిందని ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌ రెడ్డి అన్నారు. సోమవారం పరిగి పట్టణ కేంద్రంలోని బృందా వన్‌ గార్డెన్‌లో పరిగి నియోజకవర్గంలోని అన్ని మండలా లకు చెందిన 300 మందికి బీసీ బందు లక్ష రూపాయల చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు బీసీల్లో కులవృత్తులు అంతరించి పోతున్నాయని, వాటిని అభివృధ్ధి చేయాలని ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ బీసీ బందు పథకం తీసుకొచ్చారని తెలిపా రు. కులవృత్తుల పూర్వవైభవం పొందాలని ఒక్కొక్కరికీ 100 శాతం సబ్సిడీతో లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. కాబట్టి లబ్దిదారులు దీనిని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించా రు. మొదటి విడతగా నియోజకవర్గంలోని 300 మందికి చెక్కులు పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ నెల చివరి నాటికి మరో విడతలో 300 మందికి అందిస్తామన్నారు. ఎవరూ అపోహలు పెట్టుకోకూడదని ఎక్కడా వివక్ష లేకుండా చెక్కు లు పంపిణీ చేస్తామన్నారు. విడతల వారిగా ప్రతి నెలా ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఒకప్పుడు గ్రామాలు ఎలా వుండేవి ఇపుడు ఎలా వుండేవి ఆలోచించాలన్నారు. సీఎం కేసీఆర్‌ అన్ని వర్గాల వారికీ సమాన అవకాశాలు కల్పిస్తున్నారన్నారు. దళితబంధు, బీసీబందు, త్వరలోనే మైనార్టీలకు కూడా మైనార్టీబంద్‌ కూడా అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు రాష్ట్రంలో కొనసాగుతున్నాయన్నారు. ప్రతి గడపకూ ఏదో రకంగా సంక్షేమ పథకాలు అందుతు న్నాయన్నారు. కాబట్టి మరొకసారి సీఎం కేసీఆర్‌ను గెలిపించుకుందామన్నారు. కార్యక్రమంలో పరిగి మున్సి పల్‌ చైర్మన్‌ ముకుంద అశోక్‌ కుమార్‌, జడ్పీటీసీలు నాగిరెడ్డి, హరిప్రియ ప్రవీణ్‌ రెడ్డి, మేఘమాల ప్రభాకర్‌, ఎంపీపీ అరవింద్‌ రావు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సురేందర్‌, వైస్‌ ఎంపీపీ కావలి సత్యనారాయణ, బీఆర్‌ఎస్‌ పరిగి మండల అధ్యక్షుడు ఆంజనేయులు, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు ప్రవీణ్‌ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు నాయకులు, అధికారులు, బీసీబందు లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love