ప్రజలకు చెందాల్సిన భూమి సొంత వారసులకు రిజిస్ట్రేషనా ?

Is the land belonging to the people registration for their own heirs?– పేదలకు పంచకుండా సొంత ఆస్తిగా చిత్రీకరణ
– నాటి ఒప్పందాన్ని తుంగలో తొక్కిన బీఆర్‌ఎస్‌ నాయకుడు
– ఎమ్మెల్యే మంచిరెడ్డి అండతోనే భూమి ఇచ్చేందుకు నిరాకరణ
– పోల్కంపల్లిలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో అఖిల పక్ష సమావేశం
– పోల్కంపల్లిలో 60ఎకరాల భూమి పంచిన సీపీఐ(ఎం)
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
ప్రజలకు చెందాల్సిన భూమి బీఆర్‌ఎస్‌ నాయకుడు తన సొంత వారసులకు రిజిస్ట్రేషన్‌ చేయడం ఏమిటని అఖిలపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు పంచకుండా సొంత ఆస్తిగా చిత్రీకరించుకోవడం తగదన్నారు. నాటి ఒప్పందాన్ని బీఆర్‌ఎస్‌ నాయకుడు తుంగలో తొక్కాడని విమర్శించారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అండతోనే పేదలకు భూమి ఇచ్చేందుకు నిరాక రిస్తున్నారని తెలిపారు. పోల్కంపల్లిలో 60ఎకరాల భూమి పంచిన సీపీఐ(ఎం)కు మూడెకరాలు తీసుకోవడం లెక్క కాదన్నారు. కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో సాధించుకుంటామన్నారు. పోల్కంపల్లి రెవెన్యూ పరిధిలోని 176 సర్వే నెంబర్‌లోని భూమిని పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సీపీఐ(ఎం) మండల నాయకులు అమనగంటి వెంకటేష్‌, పి.జగన్‌, బీఆర్‌ఎస్‌ గ్రామాధ్యక్షులు గుండ్ల దానయ్య, బీజేపీ నాయకులు మొగిలి గణేష్‌, కాంగ్రెస్‌ నాయకులు గుండ్ల వెంకటేశ్‌, సీపీఐ మండల కార్య దర్శి పూల యాదయ్య, మాజీ వైస్‌ ఎంపీపీ కొమ్మిడి శేఖర్‌ రెడ్డి, గ్రామ సర్పంచ్‌ చెరుకూరి అండాలు గిరి, ఎంపీటీసీ చెరుకూరి మంగ రవీందర్‌, ఉప సర్పంచ్‌ కొమ్మిడి జంగారెడ్డి, బీఎస్పీ నాయకులు పి. గణేష్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీపీఐ(ఎం), వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పోరాడి సాధించిన 60 ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేసినట్టు చెప్పారు. మిగిలిన మూడు ఎకరాల భూమిని ప్రజల అవసరాలరీత్యా ఉండిందని తెలిపారు. సదరు భూమిని అప్పటి వ్యవసాయ కార్మిక సంఘంలో పని చేసిన డేరంగుల నర్సింహ పేరుపై రిజిస్ట్రేషన్‌ చేసినట్టు వివరించారు. తరువాత జరిగిన రాజకీయ పరిణామాల రిత్యా ఆయన బీఆర్‌ఎస్‌లో చేరినట్టు చెప్పారు. అనంతరం పేదలకు దక్కాల్సిన భూమి తనదేనని మోసం చేస్తున్నాడని చెప్పారు. ఆ భూమిని దాదాపు 500 మంది కుటుంబాల పేదలు సాగు చేసుకుం టున్నారని వివరించారు. భూమిని కాజేయాలనే అత్యాశతోనే భూమిని తన కుమారుడైన డేరంగుల రాజు పేరు మీద అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేశాడని చెప్పారు. ఈ భూమి విషయంలో ఎమ్మెల్యే జోక్యం చేసుకుని డి.నర్సింహ, డి.రాజు పేరుపై ఉన్న భూమిని వెంటనే గ్రామంలోని పేదలకు పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. లేనియేడలా ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) కార్యదర్శులు జీ.అశోక్‌, ఎ.నర్సింహా, పి వెంకన్న, పి స్వామి, పీఎన్‌ఎం జిల్లా కార్యదర్శి గడ్డం గణేష్‌, మండల కార్యదర్శి పి దనేశ్వర్‌, సీపీఐ(ఎం) నాయకులు కె.ఇస్తారి, జీ నర్సింహ, కర్ణాకర్‌ రెడ్డి, బాలరాజ్‌, యాదయ్య, బీజేపీ నాయకులు గుండ్ల యాదయ్య, కావలి రమేష్‌, ముదిరాజ్‌ సంఘం అధ్యక్షుడు కావలి లక్ష్మయ్య, బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి ధన్‌రాజ్‌, గ్రామ పెద్దలు గుండ్ల బాబయ్య, కంబలపల్లి పెంటయ్య మహిళలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love