చట్ట సభల్లో బీసీ మహిళ వాటా తేల్చాలి

– యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు యాదయ్య యాదవ్‌
నవతెలంగాణ-చండూరు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా బిల్లులో బీసీ మహిళల వాటా తేల్చాలని యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు మేకల యాదయ్యయాదవ్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం చండూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళ బిల్లులో ఎస్సీ, ఎస్టీ మహిళలకు అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలల్లో రిజర్వేషన్‌ కల్పించినట్లే బీసీ మహిళలకు కూడా రిజర్వేషన్‌ కల్పించాలని డిమాండ్‌ చేశారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు సీట్లు కేటాయించాలని కోరారు. ప్రభుత్వం న్యాయం చేయక పోతే బీసీలమంతా ఏకమై ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం చండూరు మండల అధ్యక్షుడు ఆవుల అశోక్‌ యాదవ్‌, చామలపల్లి సర్పంచ్‌ ముడిగ ఎర్రన్నయాదవ్‌, ఉపాధ్యక్షుడు చొప్పరి రాజు, ఉపాధ్యక్షుడు నల్ల లింగయ్యయాదవ్‌, కడారి సైదులు, జాల వెంకన్న, వరకాల సత్తయ్య, నల్ల మధు తదితరలు పాల్గొన్నారు.

Spread the love