
– వ్యవసాయ అధికారిని అనుష..
నవతెలంగాణ – వేములవాడ
విత్తనలు కొనుగోలు విషయంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పైన రైతులతో సోమవారం వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం, అనుపురం గ్రామపంచాయతీ పరిధిలో వ్యవసాయ అధికారి అనూష సమావేశాన్ని ఏర్పాటు చేసి అవగాహనా కల్పించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి అనూష మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో వ్యవసాయాన్ని సాగు చేయాలని సూచించారు. ఆయిల్ ఫాం పంట సాగు చేయుటకు ప్రభుత్వం అందించే రాయితీల గురించి రైతులకు తెలియజేశారు.మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటల వైపు రైతులను మళ్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది, ఇందుకోసం అవసరమైన పెట్టుబడి సాయాన్ని రైతులకు అందజేస్తోంది అని అన్నారు. వ్యవసాయశాఖ జారీ చేసిన లైసెన్స్ కలిగిన డీలర్ల వద్దని విత్తనా లు కొనుగోలు చేయాలని తెలిపారు.డీలర్ల వద్ద విత్తనం కొను గోలు చేసే ముందు విత్తన కంపెనీ పేరు, విత్తన రకం, లాట్ నెంబరు, గడువు తేదీ, డీలరు సంతకం వంటి విషయాలు సరిచూసు కోవాలని సూచించారు. లూజు విత్తనాలు, పగిలి న ప్యాకెట్లు, డబ్బాల విత్తనాలు కొనుగోలు చేయరాదని, విత్తన ప్యాకెట్లకు సీలు ఉందా, లేదా సరిచూసుకోవాలన్నారు. రైతులు నాణ్య మైన విత్తనాలను వాడి అధిక దిగుబడిని సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమం లో ఆనుపురం మాజీ సర్పంచ్ కొండపల్లి వెంకట రమణారావు, రుద్రవరం మాజీ సర్పంచ్ ఊరడి రాంరెడ్డి, జెడ్పిటిసి మ్యకల రవి, ప్యాక్స్ వైస్ చైర్మన్ శీలం రామచంద్ర రెడ్డి, సెక్రటరీ దిలీప్ రెడ్డి, వంకాయల లక్ష్మి రాజం, మాజీ ఎంపీటీసీ వంకాయల భూమయ్య,మెడికల్ రాజిరెడ్డి, కత్తి కనుకయ్య,అతికం కనుకయ్య, బొంగొని మల్లయ్య, గుండెల్లి హన్మాండ్లు, నర్సయ్య, సంతపురి మహేందర్ రెడ్డి, కూస బాల్ రెడ్డి, తాడెం నర్సయ్య,కూస రాజిరెడ్డి, తోపాటు తదితరులు పాల్గొన్నారు.