మంత్రికి శుభాకాంక్షల వెల్లువ

నవతెలంగాణ-సంగారెడ్డి
రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర హ్యాండ్లూమ్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌ చింతా ప్రభాకర్‌ శనివారం తన క్యాంప్‌ కార్యాలయ ఆవరణలో కేక్‌కట్‌ చేసి మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్‌ మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లా, నియోజకవర్గం తరుఫున మంత్రికి హదపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివద్ధికి అహర్నిశలు కషి చేస్తున్న హరీశ్‌రావు ఆయు రారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీడీసీ చైర్మెన్‌ కాసాల బుచ్చిరెడ్డి, గ్రంథాలయ చైర్మెన్‌ నరహారిరెడ్డి, డాక్టర్‌ శ్రీహరి విజయేందర్‌ రెడ్డి, బీఆర్‌ ఎస్‌ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు వెంకటేశ్వర్లు, నర్సింలు, నాయకులు ప్రభు గౌడ్‌, దుర్గాప్రసాద్‌, విట్టల్‌, మోహన్‌ పాల్గొన్నారు.
రామచంద్రాపురం : మంత్రి తన్నీరు హరీశ్‌రావు జన్మదినం సందర్భంగా శనివారం హైదరాబాదులోని మంత్రి నివాసంలో మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి, మాజీ ప్రోటమ్‌ చైర్మెన్‌ భూపాల్‌ రెడ్డి, కార్పొరేటర్లు సింధు ఆదర్శ రెడ్డి, పుష్ప నగేష్‌, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు ఆదర్శ్‌రెడ్డి తదితరులు మంత్రిని కలిశారు. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
సంగారెడ్డి : మంత్రి హరీశ్‌రావు జన్మదినం సందర్భంగా రైతు దినోత్సవ కార్యక్రమంలో కేక్‌కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలో ఉమ్మడి మెదక్‌ జిల్లా డిసిసిబి వైస్‌ చైర్మన్‌ పట్నం మాణిక్యం, మాజీ సి డి సి చైర్మన్‌ విజయేందర్‌ రెడ్డి, శ్రీనివాస్‌ పంతులు, డాక్టర్‌ వైద్యనాథ్‌, రైతుబంధు సమితి కోఆర్డినేటర్‌, రైతులు పాల్గొన్నారు.
జహీరాబాద్‌ : మంత్రి హరీశ్‌రావు పుట్టినరోజు వేడుకలను జహీరాబాద్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ నాయకులు, శాసనసభ టిక్కెట్‌ ఆశావాహులు, ప్రజాప్రతినిధులు పోటీపడి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. భారీ ఎత్తున కటౌట్‌లు ఏర్పాటు చేశారు. బీిఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు అనంత నవీన్‌ కుమార్‌, ఎర్రోళ్ల శ్రీనివాస్‌లు ఆకర్షణీయంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా సామాజిక కార్యకర్త ఢిల్లీ వసంత్‌ కూడా మంత్రికి శుభాకాంక్షలు తెలుపుతూ కటౌట్లు ఏర్పాటు చేj ుడం చర్చనీయాంశంగా మారింది. బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన మొగుడంపల్లి, న్యాలకల్‌, కోహిర్‌, జహీరాబాద్‌ మండలాల ప్రజా ప్రతినిధులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీల్లో ఎర్రోళ్ల శ్రీనివా స్‌కు సముచిత స్థానం కల్పించడం పట్ల బీఆర్‌ఎస్‌ నాయ కుల్లో చర్చ జరుగుతుంది. కాగా హైదరాబాద్‌లోని మంత్రి నివాసానికి వెళ్లి జహీరాబాద్‌ శాసనసభ్యులు కొనింటి మాణి క్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతోపాటు ఉమ్మడి మెదక్‌ జిల్లా డీసీఎంఎస్‌ చైర్మెన్‌ మల్కాపురం శివ కుమార్‌, సీడీసీ చైర్మన్‌ ఉమాకంత్‌ పాటిల్‌, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గుండప్ప, మాజీ ఎంపీపీ విజయ్ కుమార్‌, కేతకీ ఆల య చైర్మెన్‌ నీల వెంకటేశం, నాయకులు సుభాష్‌రెడ్డి, నామ రవికిరణ్‌, డాక్టర్‌ చంద్రశేకర్‌, సాయి ప్రణీత్‌ రెడ్డీ, ఢిల్లీ వసం త్‌, అనంత నవీన్‌ కుమార్‌, షేక్‌ ఫరీద్‌ తదితరులు ఉన్నారు.
న్యాల్‌కల్‌ : మంత్రి హరీశ్‌రావు పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లి న్యాల్కల్‌ జడ్పీటీసీ స్వప్నభాస్కర్‌ మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి పుట్టినరోజులు మంత్రి మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

Spread the love