విశ్వాసానికి మారుపేరు
బీ వేర్ ఆఫ్ డాగ్ అని బోర్డు
వీరంగం చేసే వీధిశూనకాల జోరు
పల్లేయని పట్టణమని తేడా లేదు
భౌ..భౌ.. మని మొరుగుతూ
విచ్చలవిడిగా స్వైరవిహారం
సంరక్షణ నియంత్రణ చర్యలేక
విచక్షణ రహితంగా
కంగారుపెడుతు హడలెత్తిస్తూ
కుక్కగాటుకు బిడ్డల మత్యువాతలు
సంఖ్య పెరగకుండా
కుటుంబ నియంత్రణకు
సర్కారు శస్త్రచికిత్సల వేటట
పట్టుకొనుటకు దొరకని కుక్కలట
అడ్డు అదుపులేకుండా
వాటిసంఖ్య రేటుకు చోటట
బయటకు వెళితే కుక్కకాటు
చర్మం పై సూది పోటు
గాయాలతో ఆసుపత్రికి రూటు
ఆందోళనతో భయపాటు
దాడులతో బెడద తప్పని గ్రహపాటు
నిర్లక్ష్య ధోరణితో అధికారుల ప్లాట్లు
అధికారుల లోపశాపమై తల్లిదండ్రుల
కన్నీళ్లు విదిల్చే రోజుకి
ఎప్పటికీ చరమగీతం పాడునో !
విశ్వసనీయత
ప్రజల్లో ఎప్పుడు కలుగునో!!
– డాక్టర్ పగిడిపల్లి సురేందరు
8074846063