భద్రాచలం నియోజకవర్గం

– బీఆర్ఎస్ లో బీటలు బాలసాని తో కలిసివేళ్ళలా
– బీఆర్ఏస్ లో కొనసాగాల….
– కాంగ్రెస్ సముచిత స్థానం లభిస్తుందా
-బీఆర్ఏస్ పార్టీ ప్రతినిధులు.. కార్యకర్తలు
నవతెలంగాణ- వెంకటాపురం :
 వెంకటాపురం మండల వాసి ఖమ్మం మాజీ ఎమ్మెల్సీ ,30 సంవత్సరాల కు పైగా టీడీపీ, బీఅర్ఎస్ పార్టీల్లో వివిధ పదవుల్లో కొనసాగారు.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన బీసీ నాయకుడు  బాలసాని  లక్ష్మీనారాయణ.ప్రస్తుతం భద్రాచలం బీఆర్ఎస్  పార్టీలో తనకు సముచిత స్థానం లభించడం లేదని జరుగుతున్న అవమానాన్ని కేసీఆర్, కేటీఆర్ ల దృష్టి కి తీసుకు వెళ్లిన తనకు న్యాయం జరగడం లేదని అసహనం తో రెండు రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.ఎన్నికల కు ముందు బాలసాని లక్ష్మినారాయణ బీ అర్ఎస్ పార్టీ కి దూరం కావడం తో భద్రాచలం బీఆర్ఎస్ పార్టీ కి బీటలు వారింది. అదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేసిన వెంటనే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లు ఖమ్మం లో బాలసాని నివాసంలో కలిసి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానం తెలిపారు. దాంతో వెంకటాపురం, వాజేడు మండలాల్లో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు  బాలసాని తో కలిసి వెళ్లాలా, బీఆర్ఏస్ లొనే కొనసాగేలా అనే అంతర్మథనంలో పడ్డారు. కాంగ్రెస్ లో సముచిత స్థానం లభిస్తుందా.. మాజీమంత్రి తుమ్మల, మాజీ ఎంపీ పొంగులేటి లు బాలసానిని కాంగ్రెస్ పార్టీలో కి ఆహ్వానం పలికారు. దాంతో బాలసాని దాదాపు కాంగ్రెస్ పార్టీ లోకి వెళ్లడం కాయం అనే సంకేతాలు వినిపుస్తున్నాయి. ఈ సందర్భంలో గత కొన్ని సంవత్సరాలుగా వెంకటాపురం మండల కాంగ్రేస్, బీఆర్ ఎస్ పార్టీల మధ్య పర్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి ఉంది. ఒకానొక పరిస్థితి లో కాంగ్రెస్ నాయకులు బాలసాని కుటుంబం పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దానికి బదులులుగా బీఆర్ఎస్ నాయకులు సైతం కాంగ్రెస్ పార్టీ పై ప్రతి విమర్శలు చేసారు. ఇప్పుడు బాలసాని కాంగ్రేస్ లో చేరితే..! స్థానిక కాంగ్రెస్ నాయకులు సమర్థిస్తారా? ఆయన చేరికతో ఆయనతో కలిసి నడుస్తారా? కాస్త బలంగానే ఉన్న కాంగ్రెస్ పార్టీలో బాలసాని చేరితే.. ఆయన తో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఏస్ నాయకులు ఆయన వెంట నడిస్తే వారికి సముచితమైన స్థానం లభిస్తుందా? స్థానిక బీఆర్ఎస్ నాయకులు ప్రజా ప్రతి నిధుల ప్రయాణం ఎటువైపు? బాలసాని చేరికతో వెంకటాపురం, వాజేడు మండలాల్లో కాంగ్రెస్  ఇప్పటికే కొంత బలంగా ఉన్న కాంగ్రెస్ మరికొంత బల పడవచ్చు కానీ వెంకటాపురం, వాజేడు వాజేడు మండలంలో ఈ నాయకులు కలిసి పనిచేయకుండా.. ఇప్పటి కె బలం గా ఉన్న కాంగ్రెస్ వీరి చేరికతో రెండు గ్రూపులు గా విడిపోయే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బాలసాని హాండిచ్చారా…? భద్రాచలం నియోజకవర్గ బీ ఆర్ఎస్  పార్టీ అభ్యర్థి తెల్లం వెంకటరావు మండలంలో మంగళవారం పర్యటించారు. ప్రజా ప్రతినిధులు, నాయకులు కలిసి తన గెలుపుపై సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో మండల బీఆర్ఎస్  కార్యదర్శి గంపా రాంబాబు, సీనియర్ నాయకులు వేల్పూరి లక్ష్మీ నారాయణ, బాలసాని అన్న కుమారుడు బాలసాని వేణు, కొందరు ప్రజా ప్రతినిధులు తెల్లం వెంట ఉన్నారు. ప్రధమ ప్రజా ప్రతినిధులు మాత్రం ఈ పర్యటనకు దూరంగా ఉన్నారు.
Spread the love