ఆరోగ్య ఉప కేంద్రం, వైద్యాధికారి నివాస భవనాలకు భూమిపూజ

నవతెలంగాణ- మల్హర్ రావు
మండల కేంద్రమైనా తాడిచెర్లలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో విధులు నిర్వహిస్తున్న మండల వైద్యాధికారి మండల ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటూ వైద్య సేవలందించేందుకునివాస భవనం కోసం రూ.15.75 లక్షలు,అలాగే తాడిచెర్ల ఆరోగ్య ఉప కేంద్రము-1 నిర్మాణం కోసం రూ.15.75 లక్షల ఎన్ఎస్ఎం నిధులతో నిర్మాణ పనుల కోసం శనివారం మండల ఎంపిపి, ఆరోగ్య కేంద్రం చైర్మన్ చింతలపల్లి మల్హర్ రావు, సర్పంచ్ సుంకరి సత్తయ్య భూమిపూజ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడారు నిర్మాణ పనులు చేపట్టే గుత్తేదారు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. నిధులు మంజూరు చేసిన మంథని ఎమ్మెల్యే, రాష్ట్ర ఐటి, పరిశ్రమ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి అయిత కోమల, సింగల్ విండో డైరెక్టర్ వొన్న తిరుపతి రావు, ఎంపిటిసి రావుల కల్పన మొగిలి,వైద్యాధికారి రాజు,సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love