ఇమ్రాన్‌ఖాన్‌కు భారీ ఊరట..

నవతెలంగాణ – హైదరాబాద్: పాకిస్థాన్‌ మాజీ ప్రధాని, పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ పార్టీ చైర్మన్‌ ఇమ్రాన్‌ ఖాన్‌కు భారీ ఊరట లభించింది. తోషాఖానా కేసులో ఇమ్రాన్‌కు మూడేళ్లు జైలు శిక్ష విధిస్తూ సెషన్స్‌ కోర్టు ఇచ్చిన తీర్పును ఇస్లామాబాద్‌ హైకోర్టు  నిలిపివేసింది. తోషాఖానా అవినీతి కేసులో తనకు పడ్డ శిక్షను రద్దు చేయాలంటూ ఇమ్రాన్‌ ఖాన్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌ చేసింది. ఈ మేరకు ఇమ్రాన్‌కు బెయిల్‌ మంజూరు చేస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది.  కాగా, ఈ కేసులో సెషన్స్‌ కోర్టు ఇమ్రాన్‌ను దేషిగా తేల్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయనకు మూడేళ్లు జైలు శిక్ష విధిస్తూ ఆగస్టు 5వ తేదీన తీర్పు వెలువరించింది. ప్రస్తుతం ఇమ్రాన్‌ పంజాబ్ ప్రావిన్సులో ఉన్న అటాక్ జైలు లో శిక్ష అనుభవిస్తున్నారు.

Spread the love