హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బిగ్ షాక్

– 4గురు తాజా మాజీ సర్పంచులు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిక
నవతెలంగాణ – జమ్మికుంట
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బిగ్ షాక్ జమ్మికుంట మండలంలోని నాగంపేట మాజీ సర్పంచ్ చందుపట్ల స్వాతి కృష్ణారెడ్డి ఈనెల 2న కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. శుక్రవారం మండలంలోని శాయంపేట శంభునిపల్లి తనుగుల పాపకపల్లి గ్రామాల తాజా మాజీ సర్పంచులు సుజాత భద్రయ్య, వెంకట్ రెడ్డి, చిలుముల వసంత రామస్వామి, మహేందర్ బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఒడితల ప్రణవ్ బాబు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ నాయకులు బల్గూరి మాధవరావు, రాజేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.
Spread the love