- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : పశ్చిమ బెంగాల్‌లోని ఫాల్తా అసెంబ్లీ నియోజకవర్గ రీపోలింగ్‌కు కేవలం రెండు రోజుల ముందు అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి, ఎంపీ అభిషేక్ బెనర్జీకి అత్యంత సన్నిహితుడైన జహంగీర్ ఖాన్ మంగళవారం సంచలన ప్రకటన చేశారు. తాను ఈ ఉపఎన్నికలో పోటీ నుంచి వైదొలగుతున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీ చేయబోనని స్పష్టం చేశారు.
- Advertisement -



