టీమ్ ఇండియాకు బిగ్ షాక్..

నవతెలంగాణ – హైదరాబాద్: వరల్డ్ కప్‌లో వరుస విజయాలతో భారత్ సెమీస్‌కు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. కాగా కీలక మ్యాచ్‌ల వేళ టీమ్ ఇండియాకు బిగ్ షాక్ తగిలింది. టీమ్ ఇండియా కీలక ఆటగాడు, స్టార్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా గాయం కారణంగా వరల్డ్ కప్ 2023 టోర్నీ మొత్తానికి దూరమైనట్లు ఐసీసీ ప్రకటించింది. హార్ధిక్ స్థానంలో పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ జట్టులోకి రానున్నాడు. ఆదివారం సౌత్ ఆఫ్రికాతో కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్‌లో జరిగే మ్యాచ్‌కు ప్రసిద్ధ్ కృష్ణ అందుబాటులో ఉండనున్నట్లు తెలిసింది. పుణేలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా బౌలింగ్ వేస్తుండగా హార్ధిక్ యాంకిల్ ఇంజూరీకి గురైన విషయం తెలిసిందే. అనంతరం న్యూజిలాండ్, ఇంగ్లాండ్ మ్యాచ్‌లకు సైతం ఈ స్టార్ ఆల్ రౌండర్ దూరంగానే ఉన్నాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ ఆకాడమీలో శనివారం జరిపిన వైద్య పరీక్షల్లో గాయం వేధించడంతో వరల్డ్ కప్ మొత్తానికి దూరమైనట్లు తాజాగా ఐసీసీ ప్రకటించింది.

Spread the love